For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరిలో మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ప్రభావం చూపే అంశాలు

|

పర్సనల్ ఫైనాన్స్ మార్పులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులోని పలు కీలక ప్రకటనలు మన జీవితంలో ప్రభావం చూపుతాయి. సాధారణ మార్పులు కూడా ఉంటాయి. అంటే ప్రతి నెల జరిగే మార్పులు ఉంటాయి. గ్యాస్ ధరల్లో మార్పులు వంటివి ఉంటాయి. బ్యాంకింగ్‌కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి.

ఎల్పీజీ ధరల తగ్గింపు

ఎల్పీజీ ధరల తగ్గింపు

గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నేడు క్షీణించాయి. అక్టోబర్ నుండి ఎల్పీజీ ధరలు తగ్గలేదు. సాధారణ బడ్జెట్‌కు ముందు దేశీయ చమురురంగ కంపెనీలు పలు ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.91.50 తగ్గాయి.

BOB చెక్ బుక్ మార్పులు

BOB చెక్ బుక్ మార్పులు

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1వ తేదీ నుండి చెక్ క్లియరెన్స్ రూల్స్‌ను మార్చింది. కస్టమర్లు రూ.10 లక్షల కంటే ఎక్కువ చెక్లు ద్వారా ట్రాన్సుఫర్ చేసి చెల్లింపులకు పాజిటివ్ పే(CPPS) నిర్ధారణ తప్పనిసరి. కస్టమర్ నుండి కన్ఫర్మేషన్ లేకపోతే చెక్ తిరిగి వచ్చేస్తుంది.

ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లు అయితే వారి ఖాతాల్లో డబ్బులు లేకపోవడం వలన ఈఎంఐ లేదా ఇతర వాయిదా చెల్లింపుల్లో ఫెయిల్ అయితే రూ.250 చెల్లించవలసి ఉంటుంది.

SBI IMPS ఛార్జీలు

SBI IMPS ఛార్జీలు

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇమ్మీడియేట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ట్రాన్సాక్షన్స్ పరిమితిని పెంచింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది.

English summary

ఫిబ్రవరిలో మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ప్రభావం చూపే అంశాలు | Personal Finance Changes To Impact You In February 2022

Personal finance changes impact our life and as it is Budget 2022 has been unveiled and there have been a slew of announcements which shall impact individuals life. Other than that there are usual changes.
Story first published: Wednesday, February 2, 2022, 19:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X