ప్రతి నెల వివిధ అంశాల్లో చోటు చేసుకునే మార్పులు వ్యక్తుల జీవితంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ అంశాలు ఆర్థిక అంశాలపై ప్రభావం చూపుతాయి. ఆగస్ట్ 1వ తేదీ నుండి పలుమార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుండి చోటు చేసుకునే కొన్ని మార్పులు ఇక్కడ తెలుసుకుందాం....

రేపటి నుండి నిత్యం NACH
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రతి రోజు అందుబాటులో ఉండనుందని RBI రెండు నెలల క్రితమే స్పష్టం చేసింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, వడ్డీ రేటు, డివిడెండ్,ఇతర పేమెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి భారీ చెల్లింపులు నిర్వహించేది NACH. ఇది ఆగస్ట్ 1వ తేదీ నుండి అన్ని రోజులు అంటే నిత్యం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇది బ్యాంకింగ్ వర్కింగ్ డేస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ రేపటి నుండి ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది.

ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఖరీదు
ATM నుండి పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆగస్ట్ నుండి షాక్. ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నారు. ఆయా బ్యాంకుకు చెందిన ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకుంటే పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత మాత్రం ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఛార్జీని పెంచుతున్నారు. అంటే నిర్ణీత ఉచిత ట్రాన్సాక్షన్స్‌కు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీని పెంచుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు RBI కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు కస్టమర్ నుండి రూ.21 వసూలు చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు బ్యాంకులకు అనుమతిస్తూ ఆర్బీఐ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు, ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ వరకు పరిమితి ఉంది. ఇవి మించితే ప్రస్తుతం ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.20 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని రూ.21కి పెంచారు. బ్యాంకులకు రూ.1 పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది.

ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్
హోమ్ బ్రాంచీ బ్యాంకు ఏటీఎం నుండి ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఐదు. ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద నగరాన్ని బట్టి మారుతుంది. మెట్రో నగరాల విషయంలో ఇతర బ్యాంకుల ఏటీఎం నగదు ట్రాన్సాక్షన్స్ 3, నాన్-మెట్రోల్లో ఐదుగా ఉండనుంది.

లోన్, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు
కరోనా నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీ మార్పులు చర్చనీయాంశమే. అయితే వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఆగస్ట్ 4వ తేదీ నుండి ఆగస్ట్ 7వ తేదీ మధ్య సమావేశమవుతోంది.

ICICI కొత్త రూల్స్
ఐసీఐసీఐ డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్లకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుండి మారనున్నాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఐసీఐసీఐ ఖాతాదారులకు ఆరు మెట్రో నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేవలు ఉచితం.

LPG సిలిండర్ ధర
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురురంగ సంస్థలు ప్రతి నెల సవరిస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ధరల్లో మార్పు ఉండవచ్చు.

15సీఏ/15సీబీ ఫామ్స్
గడువు సీబీడీటీ 15సీఏ/15సీబీ ఫామ్స్ ఫైలింగ్ చేసే వారికి ఊరట. ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో మరింత సడలింపులు చేసింది. మ్యాన్యువల్ ఫైలింగ్ తేదీని పొడిగించింది. కొత్త పోర్టల్‌లో సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఈ గడువును ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications