For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger: 4000%... ఈ స్టాక్స్ రిటర్న్స్ చూస్తే షాక్, రూ.20 ఇన్వెస్ట్ చేస్తే రూ.880కి

|

కరోనా మహమ్మారి నేపథ్యంలోను భారత స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను భారత సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. 2021 సంవత్సరంలో పలు స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. కరోనా కారణంగా 2020 మార్చి చివరి వారంలో సూచీలు భారీగా పతనమయ్యాయి. అయితే ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. సెకండ్ వేవ్, ఒమిక్రాన్ ఒడిదుడుకులను తట్టుకొని సూచీలు 2020 మార్చి 26,000 దిగువన కనిష్టం నుండి ప్రస్తుతం 60,000 స్థాయికి చేరుకున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం 62,000 దాటింది. అయితే ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు, ఒమిక్రాన్ భయాలతో 57,000 స్థాయిలో ఉంది. 2021లో పలు స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి.

6 పెన్నీ స్టాక్స్.. అప్రమత్తం

6 పెన్నీ స్టాక్స్.. అప్రమత్తం

లార్జ్‌క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా మైక్రో క్యాప్ మెజార్టీ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులోను కొన్ని స్టాక్స్ ఏకంగా 1000 శాతం అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్లను మురిపించాయి. మిడ్ క్యాప్‌లో పది వరకు ఇలాంటి రిటర్న్స్ ఇచ్చాయి. అయితే కొన్ని పెన్నీ స్టాక్స్ కూడా ఇలాగే అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి. 1000 శాతం అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్ చూడండి.... అయితే పెన్నీ స్టాక్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ కేవలం 2021లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ వివరాలు మాత్రమే. కానీ ఇన్వెస్ట్ చేయడం పెట్టుబడిదారుడి రిస్క్. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి నిపుణుల సలహాలు, స్టాక్స్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

ఈ స్టాక్స్ అదుర్స్

ఈ స్టాక్స్ అదుర్స్

ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ స్టాక్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 28,127 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ షేర్లు ఫిబ్రవరి 2021లో రీలిస్ట్ అయింది.

రాధే డెవలపర్స్

రాధే డెవలపర్స్ స్టాక్ ఏడాదిలో దాదాపు 3000 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ డెవలపర్. అహ్మదాబాద్, గుజరాత్‌లలో ఉంది. 2020 డిసెంబర్ 2వ తేదీన ఈ స్టాక్ రూ.9.1 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం రూ.280 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.360కి చేరుకుంది.

జిందాల్ పాలీ ఇన్వెస్ట్‌‍మెంట్ అండ్ ఫైనాన్స్

జిందాల్ పాలీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ 2021లో 1,113 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఏడాది క్రితం ఈ కంపెనీ స్టాక్ రూ.15కు దిగువన ఉండగా, ఇప్పుడు రూ.269 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.448కి చేరుకుంది.

ఇవి కూడా

ఇవి కూడా

కాస్మో ఫెర్టీస్

కాస్మో ఫెర్టీస్ స్టాక్ ఏడాదిలో దాదాపు 2000 శాతం రిటర్న్స్ ఇచ్చింది. జనవరి 1, 2021న రూ.12 వద్ద ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు ర.248 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.258కి చేరుకుంది.

టాటా టెలీ సర్వీసెస్

టాటా టెలీ సర్వీసెస్ స్టాక్ ఏడాదిలో 2171 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ముంబై ప్రధాన కార్యాలయంగా టెలీ కమ్యూనికేషన్స్, బ్రాడ్ బాండ్ సేవలను అందిస్తోంది. జనవరి 1న రూ.7.85గా ఉన్న ఈ స్టాక్ ధర ఇప్పుడు రూ.178కి చేరుకుంది. 52వారాల గరిష్టం రూ.189.

రఘువీర్ సింథటిక్స్

రఘువీర్ సింథటిక్స్ స్టాక్ ఏడాదిలో 4,223 శాతం రిటర్న్స్ ఇచ్చింది. జనవరి 1, 2021న రూ.20 వద్ద ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.882కు చేరుకుంది. ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ అందించింది.

English summary

Multibagger: 4000%... ఈ స్టాక్స్ రిటర్న్స్ చూస్తే షాక్, రూ.20 ఇన్వెస్ట్ చేస్తే రూ.880కి | Penny Stocks that Rallied 1,000%+ in One Year

The Indian stock market witnessed a stellar rally this year despite the global economy facing the hurdles from the Covid-19 pandemic. The record-breaking rally led to many stocks giving multibagger returns in 2021.
Story first published: Wednesday, December 29, 2021, 9:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X