ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది పెట్టుబడిదారులను ఆన్‌బోర్డ్ చేయాలనే లక్ష్యంతో పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం మనీ స్టాక్ బ్రోకింగ్ యాక్సెస్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరికి స్టాక్ బ్రోకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, ఎర్లీ యాక్సెస్ కార్యక్రమం కింద ఇప్పటికే 2.2 లక్షల మంది ఇన్వెస్టర్లు తమ కస్టమర్లుగా నమోదయ్యారని పేటీఎం మనీ తెలిపింది. ఇందులో ఎక్కువమంది చిన్న నగరాలు, పట్టణాలు, ఫస్ట్ టైమ్ యూజర్లు ఉన్నారని తెలిపింది. ఈ సంఖ్యను పది లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

స్టాక్ బ్రోకింగ్ సేవలు ఉచితం
పేటీఎం ఆగస్ట్ మొదటి వారంలో తన బీటా వర్షన్ స్టాక్ ట్రేడింగ్ సేవలను ప్రారంభించింది. నమోదైన 2.2 లక్షల మంది ఇన్వెస్టర్లలో 65వేల మంది 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల లోపు ఉన్న యువత కావడం గమనార్హం. గుంటూరు, థానే, ఆగ్రా వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుండి ఎక్కువ మంది నమోదయ్యారు. స్టాక్ బ్రోకింగ్ సేవలు ప్రారంభంలో కొంతమందికి అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు లభించాయి. ఇప్పుడు ఈ సేవలు ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. వెబ్ సూపర్ ఫాస్ట్ లోడింగ్ స్టాక్ చార్ట్, ట్రాక్ మార్కెట్ మూవర్స్ అండ్ కంపెనీ ఫండమెంటల్స్‌తో అందుబాటులో ఉన్నాయి. పేటీఎం మనీ స్టాక్ బ్రోకింగ్ సేవలకు గాను పోటీతో ట్రేడింగ్ ఛార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌లో నగదు డెలివరీ ట్రేడ్‌లు ఉచితం. ఇంట్రాడే యూజర్లకు రూ.10 మాత్రమే వసూలు చేస్తోంది. పేపర్‌రహితంగా, పూర్తిగా డిజిటల్ కేవైసీతో అకౌంట్ ఓపెన్ చేసే వెసులుబాటు ఉంది.

అందుకే ఎక్కువమంది మొగ్గు
ఈక్విటీ డెలివరీ ఆర్డర్స్ పైన సున్నా బ్రోకరేజీ, ఇంట్రాడేకు రూ.10.. ఇలా బ్రోకరేజీ ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం, ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరిచేందుకు వీలుండటం వంటివి ఎక్కువమంది తమ వైపు మొగ్గు చూపడానికి తోడ్పడుతుందని పేటీఎం మనీ వెల్లడించింది. దేశంలోని ప్రతి ప్రాంతానికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా అత్యంత సులభమైన ఆన్‌లైన్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపింది.

తక్కువ కాలంలో విస్తృతం
బెంగళూరు, ముంబై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ వంటి టైర్ 1 నగరాల్లో పేటీఎం మనీ ఎక్కువగా ఉది. థానే, గుంటూరు, కృష్ణ, ఆగ్రా వంటి నగరాల్లోను ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. మిలీనియల్స్‌కు స్టాక్స్‌లో పెట్టుబడి ద్వారా పోర్ట్‌పోలియోను నిర్మించుకోవడం ఇది మంచి అవకాశమని పేటీఎం మనీ సీఈవో తెలిపారు. తక్కువ వ్యవధిలో పేటీఎం మనీపై స్టాక్ ట్రేడింగ్ విస్తృతంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications