ఫిన్‌టెక్ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ సోమవారం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో, రూ.2080-రూ.2110 ఇష్యూ ధరతో వస్తోంది. దేశీయ క్యాపిటల్ మార్కెట్‌లో అతిపెద్ద ఇష్యూ ఇదే అవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.10,000 కోట్ల షేర్లు జారీ చేసి, రూ.8300 కోట్లు తాజా షేర్ల రూపంలో జారీ చేస్తారు.
మరో రెండు కంపెనీలు కూడా ఈ వారంలో ఇష్యూకు వస్తున్నాయి. అందులో ఒకటి కేఎఫ్‌సీ, పిజ్జా హట్ నిర్వహణ సంస్థ సాఫైర్ ఫుడ్స్, రెండోది లేటెంట్ వ్యూ అనలటిక్స్ ఉంది. సాఫైర్ ఫుడ్స్ ఇష్యూ మంగళవారం ప్రారంభమై, గురువారం ముగుస్తుంది. లేటెంట్ వ్యూ ఇష్యూ బుధవారం ప్రారంభమై, శుక్రవారం ముగుస్తుంది. నైకా మాతృసంస్థ FSN E-కామర్స్ వెంచర్ 11వ తేదీన, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 12న లిస్టింగ్ కానున్నాయి.

వీటి విక్రయం...
ఈ వారం ప్రధానంగా పేటీఎం మాతృసంస్థ వన్ 97, సాఫైర్ ఐపీవోకు వస్తున్నాయి. పేటీఎం ఐపీవో నవంబర్ 8న ప్రారంభమై నవంబర్ 10న ముగుస్తుంది.
ఐపీవో ప్రైస్ బాండ్ రూ.2,080 - రూ.2,150.
ఈ ఐపీవో ద్వారా పేటీఎం రూ.18,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.8300, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.10,000 సమీకరణ లక్ష్యం. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా పేటీఎం ఫౌండర్ విజయ శేఖర శర్మ రూ.402.65 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తారు. ఇతర ఇన్వెస్టర్ల విషయానికి వస్తే యాంట్‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్స్ బీవీ రూ.4,704.43 కోట్ల విలువైన షేర్లను, అలీబాబా డాట్ కామ్ సింగపూర్ ఈ కామర్స్ రూ.784.82 కోటల విలువైన షేర్లను, SVF పార్ట్‌నర్ రూ.1,689.03 కోట్ల విలువైన షేర్లను, BH ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ రూ.301.77 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా విక్రయిస్తున్నాయి. ఇతర షేర్ హోల్డర్స్ కూడా విక్రయిస్తున్నారు.

ఫండ్ అందుకే ఉపయోగం
ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేటీఎం ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు, అక్వైజేషన్, స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్స్, ఇతర కార్పోరేట్ పర్పస్ కోసం వినియోగించనున్నారు. దేశంలో అతిపెద్ద పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎం. FY21లో రూ.4,03,300 పేటీఎం ట్రాన్సాక్షన్స్, FY20లో రూ.3,03,200 పేటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు.
మొబైల్ చెల్లింపుల ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూమ్ మార్కెట్ వాటా దాదాపు నలభై శాతం. వ్యాలెట్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ మార్కెట్ షేర్ 65 శాతం నుండి 70 శాతం. గ్రాస్ మర్చంటైజ్ వ్యాల్యూ Q1FY21 రూ.69,700 కోట్లు కాగా, Q1FY22రూ.1,46,900 కోట్లకు పెరిగింది. FY21లో కన్సాలిడేటెడ్ లాస్ రూ.1701 కోట్లుగా నమోదయింది. దీర్ఘకాలానికి పేటీఎం ఐపీవోకు అగ్రెసివ్ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చునని మార్కెట్ నిపుణుల మాట.

సాఫైర్ ఫుడ్స్
మరోవైపు, సాఫైర్ ఫుడ్స్ లాస్ మేకింగ్ కంపెనీ. అయితే ఇదే మార్కెట్లో విజయాలను మూటగట్టుకున్న కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీ బ్రాండ్స్‌కు బలమైన ఉనికి ఉంది. సాఫైర్ ఫుడ్స్ వ్యాల్యూయేషన్ 7x FY21 సేల్స్‌తో వస్తోంది. ఇటీవల లిస్ట్ అయిన దేవయాని ఇంటర్నేషనల్ 14x FY21 వద్ద ట్రేడింగ్ చేస్తోంది. ఆకర్షణీయ వ్యాల్యుయేషన్‌తోనే సాఫైర్ ఫుడ్స్ వస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications