NPS vs EPF vs PPF: ఈ రోజుల్లో పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే పొదుపు చేయాలనే ఆలోచన తోనే సగం జీవితం గడిచిపోతుంది. ఖర్చులు ఓ పక్క విపరీతంగా పెరిగిపోవడం వల్ల పొదుపు చేయడం అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. నెల జీతం ఖర్చులకే సరిపోతుంటే ఇక మిగిలేది ఎక్కడ అన్నదే ప్రధాన ప్రశ్న. దీంతో 40 ఏళ్ళ వచ్చినా చాలా మంది పొదుపు చేసే పరిస్థితిలో ఉండరు. తర్వాత తప్పు గ్రహించినా లాభమేమి ఉండదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
మీరు 40 సంవత్సరాల వయస్సు గలవారైతే పొదుపు చేయలేదు..ముందు ముందు కూడా పొదుపు చేయలమేని బాధపడకండి. మనసుంటే మార్గముంటుంది. అలాగే ఆలోచన చేస్తే దానికి సమాధానం కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీరు 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా కొన్ని పథకాలలో ఇన్వెస్ట్ చేసే భారీ మొత్తాన్ని పొందవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి రిటైరయ్యే నాటికి మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. మీకు అవసరమైన ఆర్థిక బలాన్ని ఇస్తుంది. ఒక్కోసారి అది పూర్తిగా పన్ను రహితంగా కూడా ఉండవచ్చు.

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మూడు రకాలపై ప్లాన్లు ఉన్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాలలో మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా గణనీయమైన మొత్తాన్ని వ్యవధి కాలం తరువాత అందుకుంటారు. మీరు పెట్టే పెట్టుబడిని బట్టీ మీకు ఇందులో వచ్చే రాబడి ఉంటుంది. ఒక్కోదాన్ని ఇప్పుడు విశ్లేషన్ చేద్దాం.
ఉద్యోగుల భవిష్య నిధి: ఈపీఎఫ్ అనేది ఈపీఎఫ్ఓ సభ్య సంస్థలలో పనిచేసే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన పథకం.ఇందులో ఉద్యోగి జీతంలో కొంత భాగం జమ చేస్తారు. అలాగే కంపెనీ కూడా కొంత భాగం జమచేస్తుంది. ఇది కనీసం రూ. 1800 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఉద్యోగి ప్రాథమిక వేతనం, డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో 12 శాతంగా ఉంటుంది. ఖాతాదారుడు రిటైర్ అయిన తరువాత కాని లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు కాని దీన్ని ఉపసంహరించుకోవచ్చు.EPFO 8.25 శాతం స్థిర వడ్డీ రేటుతో అందుబాటులో ఉంది.
జాతీయ పెన్షన్ వ్యవస్థ: జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) అనేది పదవీ విరమణ పొదుపు పథకం, ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.దీనిలో చందాదారులు వారి పదవీ విరమణ ఖాతాకు విరాళాలు ఇస్తారు. వారి యజమానులు కూడా వారి సామాజిక భద్రత కోసం సహకరించవచ్చు ఇది వ్యక్తులు పదవీ విరమణ తర్వాత క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. NPS లో చేసిన పెట్టుబడులకు, ఉపసంహరణలకు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.
NPS అనేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నియంత్రించబడుతుంది. NPS నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఇది దీర్ఘకాలిక పొదుపులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎన్ పీఎస్ ఖాతాదారుడు వారి NPS ఖాతా కోసం ఈక్విటీ, డెట్ పెట్టుబడి ఎంపికలను ఎంచుకునే అవకాశం ఉంది. NPS కార్పస్‌లో గరిష్టంగా 60 శాతం వరకు వారు 60 ఏళ్ళ వయసులో ఉపసంహరించుకోవచ్చు. అలాగే మిగిలిన మొత్తం నుండి వారు నెలవారీ పెన్షన్ కోసం యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పిపిఎఫ్ అనేది ఒక స్వచ్ఛంద సహకార పథకం. దీనిని మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఖాతా ద్వారా తెరవవచ్చు. రెండూ ఒక్కొక్కటి 7.1 శాతం వడ్డీ రేటును ఈ పథకం కింద అందిస్తాయి. ఏడాదిలో రూ. 500 నుండి రూ.1.50 లక్షల వరకు ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. దీని మెచ్చూరిటీ 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత అతను కొనసాగించవచ్చు లేదా ఆపేయవచ్చు.
ఉదాహరణ: ఓ 40 ఏళ్ల వ్యక్తి 20 సంవత్సరాల కాలంతో ఈ మూడింటిలో పెట్టుబడిపెట్టాడనుకుందాం. అతను NPS, EPF, PPFలలో నెలకు రూ. 12, 500 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో లెక్కిద్దాం. NPS తీసుకున్నట్లయితే వడ్డీ రాబడి 12 శాతంగా ఉంటుంది. ఇక EPFలో వడ్డీ రాబడి 8.25 శాతంగా ఉంటుంది. PPFలో వడ్డీ రాబడి 7.1 శాతంగా ఉంటుంది. NPSలో 20 సంవత్సరాలలో మొత్తం రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీతో అతను రూ. 1,24,89,349 సంపాదిస్తారు. ఇక EPFలో అయితే రూ. 76,38,992.9 సంపాదిస్తాడు. PPFలో అయితే రూ. 66,58,288.17 సంపాదిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే 40 ఏళ్ళ వ్యక్తి 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే సుమారు రూ. 67 లక్షలు రిటైర్మెంట్ నిధిని సేకరిస్తాడు.
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications