పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం అని ప్రతి తల్లిదండ్రి భావిస్తారు. ముఖ్యంగా పెరుగుతున్న విద్య ఖర్చులు, విదేశీ చదువులు, ప్రొఫెషనల్ కోర్సుల వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే, సాధారణ పొదుపులు సరిపోవని అనిపిస్తుంది. అందుకే వడ్డీ, కంపౌండింగ్ వంటి ప్రయోజనాలు కలిగిన దీర్ఘకాల పెట్టుబడులపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన NPS Vatsalya పథకం పిల్లల భవిష్యత్తు కోసం ఒక కొత్త మార్గంగా చర్చకు వచ్చింది. అయితే ఇది నిజంగా పిల్లల విద్య నిధిగా సరిపోతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది.
NPS Vatsalya అనేది 2024లో PFRDA ద్వారా ప్రవేశపెట్టబడిన ప్రత్యేక పథకం. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోనే పనిచేస్తూ, చిన్న పిల్లల పేరున ఖాతా తెరిచి దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఈ ఖాతాను నిర్వహిస్తారు. పిల్లలు 18 ఏళ్లకు చేరుకున్న తర్వాత ఈ ఖాతా ఆటోమేటిక్‌గా అతడి పేరున ఉన్న NPS Tier-I ఖాతాగా మారుతుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం చిన్న వయసులోనే పొదుపు అలవాటు పెంచడం, భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడం.

ఈ పథకం పెన్షన్ ఆధారిత పొదుపు పథకం అయినప్పటికీ.. చాలామంది తల్లిదండ్రులు దీనిని పిల్లల విద్య అవసరాల కోసం ఉపయోగించవచ్చా అనే కోణంలో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా Exit, Withdrawal నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. పిల్లలు 18 ఏళ్లు పూర్తిచేసిన తర్వాత మొత్తం నిధిలో 80 శాతం వరకు లంప్‌సమ్‌గా తీసుకునే అవకాశం కల్పించారు. అయితే మిగిలిన 20 శాతం మాత్రం తప్పనిసరిగా అన్యూటీగా మార్చాల్సి ఉంటుంది. అంటే ఆ మొత్తాన్ని నెలవారీ పెన్షన్ రూపంలో మాత్రమే పొందగలరు.
ఇక్కడే విద్య నిధిగా ఈ పథకం ఉపయోగంపై సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే పిల్లల ఉన్నత విద్య సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఒక్కసారిగా అవసరం అవుతుంది. అలాంటి సందర్భంలో 20 శాతం మొత్తాన్ని అన్యూటీగా మార్చాల్సిన నిబంధన కొంతమంది తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారవచ్చు. అంతేకాదు, లంప్‌సమ్‌గా తీసుకునే మొత్తంలో 60 శాతం వరకు మాత్రమే పన్ను మినహాయింపు స్పష్టంగా ఉండగా.. మిగిలిన మొత్తంపై పన్ను విధింపు ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు.
Partial Withdrawal విషయంలో కూడా పరిమితులు ఉన్నాయి. పిల్లలు 18 ఏళ్లకు చేరుకునేలోపు రెండు సార్లు, 18 నుంచి 21 ఏళ్ల మధ్య మరో రెండు సార్లు మాత్రమే స్వల్ప మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మొత్తం పెట్టుబడిలో గరిష్టంగా 25 శాతం వరకే పరిమితం. పెరుగుతున్న విద్య ఖర్చులను చూస్తే, ఈ పరిమిత ఉపసంహరణలు సరిపోవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ పథకానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ మొత్తంతో ఖాతా ప్రారంభించవచ్చు. సంవత్సరానికి కేవలం రూ. 250తో కూడా పెట్టుబడి మొదలు పెట్టడం సాధ్యం. తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఈ ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కావడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి.
క్లుప్తంగా చెప్పాలంటే NPS Vatsalya పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఒక మంచి పథకం అయినప్పటికీ, దాన్ని పూర్తిగా పిల్లల విద్య నిధిగా మాత్రమే ఆధారపడటం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఇది దీర్ఘకాలిక సేవింగ్, పెన్షన్ దృష్టితో ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఫ్లెక్సిబుల్ పెట్టుబడులతో పాటు ఈ పథకాన్ని అదనపు ఎంపికగా పరిగణలోకి తీసుకోవడం మరింత సురక్షితమైన వ్యూహంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications