మీరు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? తక్కువ రిస్క్ తీసుకుంటూ అద్భుతమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (nps scheme) లో వచ్చిన సరికొత్త మార్పులు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే అవకాశం ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదెలాగంటే..

ఇండియాలో పెట్టుబడి అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds). కానీ, ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) భారీ అప్‌గ్రేడ్స్ ద్వారా అంతకు మించిన బెస్ట్ ఆప్షన్ గా మారిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ కొత్త రూల్స్ ఎలా ఉపయోగపడతాయో ఓసారి చూద్దాం..
100% ఈక్విటీ కేటాయింపు!
NPS లో వచ్చిన అతి ముఖ్యమైన మార్పులలో మొదటిది.. పెట్టుబడిని పూర్తిగా 100% ఈక్విటీ (Equity) లో కేటాయించుకునే అవకాశం రావడం. గతంలో మీ వయసు, మీరు ఎంచుకున్న స్కీమ్‌ను బట్టి ఈక్విటీ (షేర్లు) లో పెట్టుబడి 75% వరకు పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ లేదు. ఇది ముఖ్యంగా 20ల వయసులో ఉన్న వారికి ఒక గొప్ప అవకాశం. తక్కువ వయసులో పూర్తి స్థాయిలో ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం వలన NPS పన్ను ప్రయోజనాలతోపాటు సంపద సృష్టి కూడా వేగంగా జరుగుతుంది.
రిటైర్మెంట్ కోసమే కాదు
NPS కేవలం పదవీ విరమణ (Retirement) కోసమే అనే భావన ఉండేది. ఎందుకంటే మెచ్యూరిటీ కోసం రిటైర్‌మెంట్ వయసు వరకు వేచి చూడాలి. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మారింది! కొత్త రూల్ ప్రకారం లాక్-ఇన్ పీరియడ్ కేవలం 15 ఏళ్లకు తగ్గింది. అంటే, ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత విద్య లేదా కెరీర్‌లో కొంత కాలం విరామం వంటి మధ్యకాలిక లక్ష్యాల కోసం కూడా మీరు NPS ని వాడుకోవచ్చు.
మల్టీ-స్కీమ్ ఫ్లెక్సిబిలిటీ
ముందు కేవలం ఒకే స్కీమ్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు, పెట్టుబడిదారులు.. అగ్రెసివ్ (Aggressive), బ్యాలెన్స్‌డ్ (Balanced) లేదా కన్జర్వేటివ్ (Conservative).. ఇలా నచ్చిన ఆప్షన్స్‌ను కలిపి ఎంచుకునే అవకాశం వచ్చింది.
తక్కువ ఖర్చు
ఇన్ని అవకాశాలు కల్పిస్తూ కూడా NPS ఇండియాలో అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా ఉంది. ఇందులో మేనేజ్‌మెంట్ ఫీజు 0.09% నుంచి 0.30% కి పెరిగినప్పటికీ ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే.. మ్యూచువల్ ఫండ్స్ ఖర్చు సాధారణంగా 1 నుంచి 2% వరకు ఉంటుంది.
సరైన విధంగా వాడుకుంటే..
ఈ కొత్త రూల్స్ వల్ల nps scheme కేవలం ఒక రిటైర్‌మెంట్ ఫండ్ గా కాకుండా అత్యంత సౌకర్యవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన బెస్ట్ ఫండ్ గా మారింది. ఈ స్కీమ్ ను తెలివిగా ఉపయోగించుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ సంపదను అందించే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications