సేవింగ్స్ లేదా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అయితే సేవింగ్స్ ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కొందరికి తెలియక పోవచ్చు. అయితే సాధారణంగా కొందరు పెళ్ళికి ముందు నుండి లేదా పెళ్లి తరువాత పిల్లల ఫ్యూచర్ కోసం సేవింగ్స్ పై దృష్టి పెడుతుంటారు. ఇలాంటి వారికోసమే నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) తీసుకొచ్చారు.
NPS వాత్సల్య అనేది మైనర్‌ల కోసం తీసుకొచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కంట్రిబ్యూటరీ కొత్త పెన్షన్ పథకం. చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ సేవింగ్స్ అలవాటు చేయడం ద్వారా పిల్లలను శక్తివంతం చేయడం దీని లక్ష్యం. తల్లిదండ్రులు ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా నెలకు కనీసం రూ.1,000 డిపాజిట్ చేయడం ద్వారా, NPS వాత్సల్య పథకం పిల్లలు క్రమశిక్షణతో కూడిన సేవింగ్స్ అలవాటు చేయడంలో సహాయపడుతుంది. పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ ప్లాన్ తల్లిదండ్రులు చూసుకోవచ్చు. అయితే అకౌంట్ మాత్రం పిల్లల పేరు మీద ఉంటుంది. పిల్లలు 18 ఏళ్లకు చేరుకున్నప్పుడు దానిని స్టాండర్డ్ NPS అకౌంట్ లేదా నాన్ NPS ప్లాన్‌గా మార్చవచ్చు.

NPS వాత్సల్య అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హత
* 18ఏళ్ల లోపు ఉన్న మైనర్లందరూ అర్హులు
* మైనర్ పేరు మీద అకౌంట్ చేసాక పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు వారి సంరక్షకులే అకౌంట్ మైంటైన్ చేస్తారు.
*పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)తో రిజిస్టర్డ్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoPs) ద్వారా అకౌంట్ క్రియేట్ చేయవచ్చు.
*ఈ PoPsలో ప్రముఖ బ్యాంకులు, ఇండియా పోస్ట్ అండ్ పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి.
*ఆన్‌లైన్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం మీరు NPS ట్రస్ట్ eNPS ప్లాట్‌ఫారమ్ చూడవచ్చు.
NPS వాత్సల్య అకౌంట్ తెరవడానికి కావల్సిన డాకుమెంట్స్
*మైనర్ బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
*గార్డియన్ KYC
*గార్డియన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN).
*NRE/NRO బ్యాంక్ అకౌంట్ (సోలో లేదా జాయింట్)
మీరు NPS వాత్సల్యలో పెట్టుబడి పెట్టాలా?
NPS వాత్సల్య లాంచ్ అనేది భారతదేశంలో, ముఖ్యంగా యువ తరంలో పెన్షన్ ప్లానింగ్ తీసుకురావాలనేదే ఒక పెద్ద అడుగు. "మా మార్కెట్ సర్వేలో భారతీయులు పెరుగుతున్న ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నందున, రిటైర్మెంట్ ప్లాన్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకం ఆకర్షణీయంగా ఉంది, ఎందుకంటే మార్కెట్‌తో అనుసంధానించిన రిటర్న్‌ల ద్వారా దీర్ఘకాలంలో సంపదను సృష్టించడంలో సహాయపడుతుంది, పిల్లలకు మంచి రిటైర్‌మెంట్‌ను అందించడంలో తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉంటుంది, భారతదేశంలో ఎన్‌పిఎస్ వాత్సల్యతో ముందస్తు రిటైమెంట్ ప్లానింగ్ ప్రారంభించడం అర్థవంతంగా ఉంటుందని "అని వైభవంగల్ అనుకూలకర ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications