రూపే కార్డుపై బంపరాఫర్: నెలకు రూ.16,000 ఆదా, 40% క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నేషనల్ రూపే కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించే వారికి ఇది వర్తిస్తుంది. ఎంపిక చేయబడిన దేశాల్లో ఈ కార్డు ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్ ద్వారా పెద్ద మొత్తంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు గురువారం నాడు NPCI తెలిపింది.

40% ఆఫర్... ఈ దేశాల్లో..
రూపే ట్రావెల్ టేల్స్‌లో పథకంలో భాగంగా విదేశాల్లో పర్యటించే వారికి పీవోఎస్ ట్రాన్సాక్షన్స్ పైన 40% వరకు ఆఫర్లు ప్రకటించింది. యూఏఈ, సింగపూర్, శ్రీలంక, యూకే, యూఎస్, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.

రూ.16,000 వరకు క్యాష్ బ్యాక్ ఆదా
ఎంపిక చేయబడిన దేశాలకు వెళ్లే భారతీయులు తమ రూపే ఇంటర్నేషనల్ కార్డుకు యాక్టివేట్ కావడం ద్వారా నెలకు రూ.16,000 క్యాష్ బ్యాంక్ పొందవచ్చునని NPCI ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ పర్యటన చేసే భారతీయులను డిజిటల్ పేమెంట్స్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ పద్ధతిని తీసుకు వచ్చింది.

ఇలా యాక్టివేట్ చేసుకోవాలి
ఈ ఆఫర్ల ద్వారా కార్డు వినియోగదారులు కొత్త ఏడాది సహా వేసవి సెలవుల పర్యటనలలో చేసే షాపింగ్ పైన క్యాష్ బ్యాక్‌తో పాటు మరింత ఎక్కువ నగదు ఆదా చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఆఫర్ పొందేందుకు వినియోగదారులు తమ రూపే కార్డును సంబంధిత బ్యాంకు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలి.

రూ.1000 కొనుగోలు చేయాలి.. క్యాష్‌బ్యాక్ పరిమితిరూ.4,000
రూపే ఇంటర్నేషనల్ కార్డ్స్ వినియోగదారులు రూపే ట్రావెల్ టేల్స్ కింద క్యాష్ బ్యాక్ కింద ఎక్కువ ఆదా చేయవచ్చునని తెలిపింది. అయితే ఈ ఆఫర్లు పొందేందుకు కస్టమర్లు కనీసం రూ.1,000 ట్రాన్సాక్షన్స్ చేయాలి. గరిష్ట సింగిల్ ట్రాన్సాక్షన్ పైన రూ.4,000 క్యాష్ బ్యాక్ పరిమితి ఉంది.

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే 16,000కు మించి
ఒక నెలలో నాలుగుసార్లు ఈ ఆఫర్లు పొందవచ్చు. అంటే ఒక్కో ట్రాన్సాక్షన్ పైన గరిష్టంగా రూ.4,000 ఆదా చేస్తూ నాలుగుసార్లు ఉపయోగించుకునే వెసులుబాటు ద్వారా మొత్తం రూ.16,000 ఆదా చేసుకోవచ్చు. మరో విషయం ఏమంటే ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

నగదు క్యాష్ బ్యాక్
ఈ ఆఫర్లపై NPCI సీవోవో ప్రవీణ్ రాయ్ మాట్లాడుతూ... రూపే ట్రావెల్ టేల్స్ స్కీం కింద గ్లోబల్ ఆఫర్లు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, దీని ద్వారా కస్టమర్లు నగదు క్యాష్ బ్యాక్ పొందవచ్చునని చెప్పారు. అదనంగా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని లాంజ్‌లలో అనుమతి పొందవచ్చునని చెప్పారు. థామస్ కుక్, మేక్ మై ట్రిప్ వంటి సైట్లలో విమాన టిక్కెట్ల బుకింగ్స్‌పై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయని తెలిపారు.

అట్రాక్టివ్ ఆఫర్లు
థామస్‌కుక్, మేక్ మై ట్రిప్ వంటి సైట్లలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకోవడం ద్వారా అట్రాక్టివ్ ఆఫర్లు పొందవచ్చు. రూపే డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీస్ (DFS), జపాన్ బేస్డ్ JCB ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూపేకార్డుతో 190 దేశాల్లో యాక్సెస్ ఉంది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ సహా 1,100 బ్యాంకులు రూపే కార్డు కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications