బంగారం ధరలు రోజురోజుకి మారుతుంటాయని మీకు తెలిసిందే. అయితే బంగారం ధర ఒక రోజులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. దీనికి అనేక కారణాలు కూడా ఉంటాయి. మన దేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో ఏ శుభకార్యమైన, పెళ్లిళ్లకైనా ముందుగా పసిడి కొనేందుకే ఇష్టపడతారు.
మీ ఫోన్లో గూగుల్ పే ద్వారా డబ్బులు పంపడం, పొందడమే కాదు ఈజీగా డబ్బు కూడా సంపాదించొచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా... గూగుల్ పే ద్వారా ఒక వ్యక్తి ఒక చోట నుండి మరొకరికి ఈజీగా క్షణాల్లో డబ్బులు పంపవచ్చు. మని ట్రాన్స్ఫర్ కోసమే కాకుండా మీరు డబ్బు కూడా సంపాదించొచ్చు. ఇందుకు ముందుగా మీ గూగుల్ పేలో గోల్డ్ లాకర్ అనే అప్షన్ లేదా సెర్చ్ బార్లో గోల్డ్ లాకర్ అని టైప్ చేస్తే మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు దానిని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

గోల్డ్ లాకర్ అంటే మీరు బంగారాన్ని డిజిటల్ గోల్డ్ రూపంలో కొనవచ్చు. అంటే ఈ గోల్డ్ మీకు ఫిజికల్ గా ఉండదు. గోల్డ్ లాకర్లో మీరు బంగారాన్ని గ్రాములు, మిల్లి గ్రాములలో కూడా కొనవచ్చు. అయితే దీనికి సంబంధించి రేట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు బంగారాన్ని నచ్చినంత మొత్తంతో కొనొచ్చు. గోల్డ్ లాకర్ లో కొన్న బంగారం మీ అకౌంట్లోకి జమ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే డిజిటల్ గోల్డ్ ధరలు కూడా బంగారం ధరలులాగే ఎప్పుడైనా పెరగవచ్చు తగ్గొచ్చు.
డిజిటల్ గోల్డ్ ధర పడిపోయినపుడు కొంత మొత్తంతో కోని మీరు దానిని ధర పెరిగినపుడు దిరిగి అమ్మేయవచ్చు. ఇలా మీరు పెట్టుబడిగా పెట్టి కొన్న డిజిటల్ గోల్డ్ ధర పెరిగాక అమ్మడం ద్వారా మీరు లాభం పొందవచ్చు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు కూడా ఎంత మొత్తం అమ్మాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు మీరు కొంటున్న డిజిటల్ గోల్డ్ పై GST ఇతర టాక్సెస్ చార్జెస్ కూడా ఉంటాయి. మరొక విషయం ఏంటంటే గోల్డ్ లాకర్లో మీరు 99.99% స్వచ్ఛతతో 1 గ్రామ్ నుండి 10 గ్రాముల వరకు గోల్డ్ కొంటే మీకు హోమ్ డెలివరీ కూడా లభిస్తుంది. ఈ బంగారం గోల్డ్ కాయిన్, గోల్డ్ బిస్కెట్ రూపంలో మీకు అందుతుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications