తమ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కువమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ రిస్క్ ఉండదు. మూలధన పెట్టుబడి హామీ, ముందే తెలిసిన వడ్డీ హామీ ఉంటుంది. వృద్ధులు, పెన్షనర్లు సహా వివిధ వర్గాలు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే వడ్డీ పైన ఆధారపడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి అనంతరం ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే వడ్డీ రేటు తగ్గింది.
మరికొన్ని రోజులు కూడా వడ్డీ రేట్లు ఇలా తక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధిక ద్రవ్యోల్భణ రేటు 5.59 శాతం వద్ద ఉంది. ఇది ఛాలెంజింగ్‌తో కూడుకున్నదే. ప్రస్తుతం వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందున చాలామంది బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదు. ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
ప్రధాన జాతీయ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకుల్లో ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఆల్ టైమ్ కనిష్టం వద్ద ఉన్నాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 3.50% - 5.70%, HDFC బ్యాంకులో 3.50% - 6.25%, యాక్సిస్ బ్యాంకులో 3.50% - 6.50% వడ్డీ రేట్లు ఉన్నాయి. దేశంలోని పది ప్రధాన బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు దాదాపు అన్ని బ్యాంకుల్లో స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.
- SBI బ్యాంకు 7 days - 10 years - వడ్డీ రేటు 3.50% - 5.70%,
- HDFC బ్యాంకు 7 days - 10 years - వడ్డీ రేటు 3.50% - 6.25%,
- Axis బ్యాంకు 7 days - 10 years - వడ్డీ రేటు 3.50% - 6.50%,
- Bank of Baroda 7 days - 10 years - వడ్డీ రేటు 4.25% - 6.15%,
- ICICI బ్యాంకు 7 days - 10 years - వడ్డీ రేటు 3.50% - 6.00%,
- పంజాబ్ నేషనల్ బ్యాంకు - 7 days - 10 years - వడ్డీ రేటు 4.25% - 5.80%,
- IDBI బ్యాంకు - 15 days - 20 years - వడ్డీ రేటు 3.10% - 5.90%,
- Canara బ్యాంకు - 7 days - 10 years - వడ్డీ రేటు 4.25% - 5.85%,
- RBL బ్యాంకు - 7 days - 10 years - వడ్డీ రేటు 5.00% - 7.25%,
- Yes బ్యాంకు - 7 days - 10 years - వడ్డీ రేటు 5.00% - 7.25%

వడ్డీ రేట్లు కనిష్టం
భారతీయ ప్రభుత్వ బ్యాంకులు చాలాకాలంగా ఇప్పటి వరకు 8 శాతం నుండి 9 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8 శాతం నుండి 9.25 శాతం ఉన్నాయి. ఇక విదేశీ బ్యాంకులు 6.75 శాతం నుండి 8.6 శాతం మధ్య ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో మరింత ద్రవ్యతను పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. అక్టోబర్ 2019లో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతం ఉండగా మార్చి 2020 నాటికి 4.40 శాతానికి పడిపోయాయి. మే 2020 నుండి ఇప్పటి వరకు ఇది ఆల్ టైమ్ కనిష్టానికి (4 శాతం) చేరుకుంది. అందుకే FD రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రుణ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రత్యామ్నాయ వడ్డీ రేట్లు
ఎవరైనా FD నుండి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే రిటర్న్స్ మరింత ఎక్కువగా వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) వంటి మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో రిస్క్ ఉంది. అయితే తక్కువ రాబడి కలిగిన గ్యారెంటీ హామీ ప్రభుత్వ సాధనాలు కూడా ఉన్నాయి. ఆర్బీఐ జారీ చేసే సావరీన్ గోల్డ్ బాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ మూలధన హామీ ఉంటుంది.
మీరు సీనియర్ సిటిజన్ అయితే ఆర్బీఐ ద్వారా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీంను ఎంచుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతం వస్తుంది. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి వయ వందన యోజనలో 7.4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. మరొకటి పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS)లో 6.6 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఈ పథకంలో అత్యధిక పెట్టుబడి రూ.4.5 లక్షలు. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఆల్ టైమ్ కనిష్టం వద్ద ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ఈ స్థాయి అయిదేళ్ల కనిష్టానికి చేరుకుంటుందని ఊహించలేదు. కానీ కరోనా వడ్డీ రేట్లను దెబ్బతీసింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications