SIP మ్యూచువల్ ఫండ్స్‌లోనే కాదు, ఈ స్టాక్స్ సిప్‌లోను ఇన్వెస్ట్ చేయవచ్చు
మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? కొన్ని స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయని మీరు భావిస్తే కనుక ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే విధంగానే కొన్ని స్టాక్స్‌లోను పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఒక నిర్దిష్ట పథకం యొక్క ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అదే డబ్బును నేరుగా కొన్ని మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్‌లోను అలాగే పెట్టవచ్చు. మీరు షేర్లను కొనుగోలు చేసిన విధంగా ప్రతి నెల కొద్ది మొత్తంలో స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు.

కోల్ ఇండియా
SIP పెట్టుబడి కోసం పలు స్టాక్స్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇందులో కోల్ ఇండియా ఒకటి. పెట్టుబడిదారు స్టాక్ పైన పొందే డివిడెండ్ ముఖ్యమైనది. గత ఏడాది కంపెనీ 12.5 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.147 వద్ద ఉంది. ఈ స్టాక్ డివిడెండ్ యీల్డ్స్ బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే బాగున్నాయని చెప్పవచ్చు. ఎడెల్వెసిస్ ప్రకారం కోల్ ఇండియా FY22 మొదటి త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగిన కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ కంపెనీ హిస్టరీ చూసి పెట్టుబడులు పెట్టేవారు ఎందరో. ఏదైనా సంస్థ వృద్ధిపై మీకు పూర్తి విశ్వాసం ఉంటే చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టవచ్చు. ప్రతి నెల రిలయన్స్ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు. పలు బ్రోకరేజీ సంస్థలు రిలయన్స్ పైన రాబోయే అయిదేళ్ల కాలంలో బుల్లిష్‌గా ఉన్నాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఇటీవల ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది.

ఇది సానుకూలత
స్టాక్స్ సిప్‌లో ఉన్న సానుకూలత ఏమిటంటే ధరలు క్షీణించినప్పుడు మీరు ప్రతి నెల మళ్లీ కొనుగోలు చేయవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే మార్కెట్ హెచ్చుతగ్గుదల ప్రమాదం ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి స్టాక్ మార్కెట్‌తో ముడివడిన అంశం. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంశాలు ఆయా సూచీలు ఆయా కాలాల్లో ఇచ్చిన రిటర్న్స్ మాత్రమే. కాబట్టి మున్ముందు చెప్పలేం. కాబట్టి ఆయా ఫండ్‌ను పరిశీలించి, నిపుణుల సూచనలతో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది.


Click it and Unblock the Notifications