సాధారణంగా 'పెట్టుబడి' అంటే గుర్తుకు వచ్చేది డబ్బు! డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ రూపంలో బ్యాంకుల్లో దాస్తారు. ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్‌లో, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం... ఇలా వివిధ మార్గాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. సురక్షిత పెట్టుబడి కోసమైతే తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అయితే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. అయితే పెట్టుబడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది డబ్బు. దీనిని వివిధ అంశాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందుతాము.

తిరిగి రాని పెట్టుబడి
డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు లేదా నష్టపోవచ్చు. డబ్బును కోల్పోయినా తిరిగి సంపాదించడం సాధ్యమే! కానీ ఇన్వెస్ట్ చేయకుంటే మరలా తిరిగి రానిది మాత్రం ఒకటి ఉంది.. అది కాలం. డబ్బును మాత్రమే కాదు, కాలాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి! డబ్బును ఇన్వెస్ట్ చేయకుంటే ఫలితాన్ని కోల్పోతాం. అవసరమైతే సరిదిద్దుకొని మళ్లీ ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ కాలాన్ని ఇన్వెస్ట్ చేయకుంటే తిరిగి రాదు.

కాలం వృధా చేయవద్దు
కాలం కూడా ఓ పెట్టుబడి. కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేయవద్దు. కాలం ఒక విమాన ఛార్జీ వంటిది. మీరు విమానంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే నెల రోజుల ముందు టిక్కెట్ తీసుకుంటే ఛార్జీ రూ.2,000గా ఉండవచ్చు. రేపటి కోసం తీసుకుందాం అనుకుంటే మాత్రం అదే ఛార్జీ రూ.10,000 కావొచ్చు. అలాగే, విమానం టేక్ఆఫ్ అయిందంటే ఖాళీగా ఉన్న సీటు వ్యాల్యూ జీరో. సమయాన్ని కూడా వృధా చేయవద్దు. ఏ మన టార్గెట్‌కు చాలా సమయం ఉంది కదా అని సమయాన్ని వృధా చేస్తే రూ.2,000తో పోయే పని, దగ్గరకు వచ్చాక రూ.10,000 విమాన టిక్కెట్ ధరలా మారిపోతుంది. సమయం గడిచిపోతే దానిని తీసుకు రాలేదు. కాబట్టి అది జీరోతో సమానం.

టైమ్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థి అయితే పరీక్షలకు మరో పది నెలల గడువు ఉంది కదా అని భావిస్తే, అవే పరీక్షలు సమీపించాక ఎంత చదివినా మెదడుకు ఎక్కదు. కాబట్టి ముందు నుండి ప్లాన్‌గా చదువుకోవాలి. ఎవరి మార్గంలో వారు తమ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమ తమ రంగాల్లో తాము చేసే వాటికే పరిమితం కాకుండా, కొత్తగా పరిశోధించేందుకు సమయాన్ని కేటాయించాలి. తద్వారా మన మెదడును పదును చేసుకోవాలి. మరింత తెలుసుకునేందుకు శ్రద్ధ చూపాలి. సెలవు రోజు కదా అని వృధా చేయడానికి బదులు, మీకు తెలిసిన విద్యలో కొత్తదనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనినే టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications