ఒకప్పుడూ బంగారం లాంటి సంప్రదాయ పెట్టుబడులే భారతీయ సంపన్నులకు తొలి ఎంపిక. కానీ ఇప్పుడూ ఏదో మారుతోంది. షేర్ల మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి కానీ కొత్తగా ఆకట్టుకునేవిగా లేవు, బంగారం మళ్లీ మిగిలిన పెట్టుబడులా మరింత వృద్ధి చూపించటం లేదు. దీంతో ఇప్పుడు చాలా మంది ధనికులు మరో దిశగా చూస్తున్నారు అదే క్రిప్టోకరెన్సీ.

బిట్‌కాయిన్ లో పెట్టుబడి చేయడం ఫ్యూచర్‌కి ప్రిపరేషన్. ఈ మధ్యకాలంలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న ఫ్యామిలీ ఆఫీసులు, పెద్ద పారిశ్రామిక వర్గాలు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తిని చూపించటం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా, బిట్‌కాయిన్ మళ్లీ తన విలువ పెంచుకోవడం, ఒక ఏడాదిలోనే 90% లాభం చూపించడంతో ఇది ఒక్క ఎక్స్‌పెరిమెంటల్ అసెట్ కాకుండా, ఒక మంచి పెట్టుబడి ఎంపికలా చూడొచ్చు.
పెట్టుబడిదారులు ఎందుకు క్రిప్టో వైపు?
పాత పెట్టుబడుల మీద ఆసక్తి తగ్గిపోతున్న ఈ సమయంలో, పెట్టుబడిదారులు కొత్త దిశలు వెతుకుతున్నారు. బిట్‌కాయిన్ వంటి డిజిటల్ యాసెట్‌లు డిమాండ్ పెంచుకుంటున్నాయి. అమెరికాలో బిట్‌కాయిన్ ETFల అమోదం, అంతర్జాతీయంగా క్రిప్టో రెగ్యులేషన్ స్పష్టత రావడం భారతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. క్రిప్టో ఇప్పుడు ఒక ట్రేడింగ్ టూల్ కాదు. ఇది డిజిటల్ ఫ్యూచర్‌లో అడుగు పెట్టే మార్గం.
క్రిప్టోలో ధనికుల పోర్టుఫోలియోకి కొత్త రంగు
CoinDCX, CoinSwitch వంటివి తెలిపిన ప్రకారం ఇప్పుడు వారిది ఒక 'యంగ్ ట్రేడర్' గేమ్ కాదు. కేవలం 3,500 మంది HNI & ఫ్యామిలీ ఆఫీసుల నుంచే క్రిప్టో టర్నోవర్‌లో సగం వస్తోందంటే ఇది చిన్న విషయం కాదు. ఈ పెట్టుబడులు కేవలం లాభాల కోసం మాత్రమే కాదు. బ్లాక్చెయిన్ టెక్నాలజీలు, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (DeFi) వంటివి భవిష్యత్తు ఫైనాన్స్‌కు పునాది అన్నారు అని చేద్దామని చాలా మందికి నమ్మకం ఏర్పడింది.
భారత్‌లో డిజిటల్ యాసెట్ పైన టాక్స్ విధానం పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి 30% క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, ప్రతి ట్రాన్సాక్షన్ పై 1% TDS ఉండటం వలన రిటైల్ ఇంట్రెస్ట్ దిగజారిపోయింది. పన్నుల భారాన్ని నివారించేందుకు కొందరు విదేశీ ఎక్స్‌ఛేంజ్‌లలో ట్రేడింగ్ చేయడం లేదా అన్‌ఆఫీషియల్ మార్గాల వైపు మళ్లుతున్నారు.
ప్రయోజనాలను విశ్లేషించి చూస్తే నిబంధనల మధ్య బహుళమార్గాలు చూసి ముందుకెళ్తున్నారు. ధనికుల దృష్టిలో ఇప్పుడు క్రిప్టో అనేది బంగారం వంటి అల్టర్నేటివ్ అసెట్, రాబోయే డిజిటల్ ఫైనాన్స్ ప్రపంచంలో ముందస్తు అడుగు. ఫిన్‌టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలనుకునే ఆత్మవిశ్వాసం.
ఈ మార్పు ఇప్పుడే మొదలైంది. మరి కొద్ది సంవత్సరాల్లో ఇది క్రిప్టో అసెట్ వర్గాన్ని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావొచ్చు. ధనికులు పెట్టుబడి పెడుతున్నారని చూసి అందరూ తమ సంపద మొత్తాన్ని క్రిప్టోలో పెట్టడం మంచిదికాదు. ఇది హై-రిస్క్ పెట్టుబడి. కనీసం దీని మీద అవగాహన తెలుసుకుని, మెల్లగా ప్రారంభించి, స్టెబుల్ కాయిన్‌లను ఎంచుకోవడం, ట్రెండ్స్‌ను అర్థం చేసుకోవడం అవసరం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications