రోడ్డుపై వాహనం మీద వెళ్తుంటే మీ వెంట డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, వాహన బీమా డాక్యుమెంట్స్ వంటివి కచ్చితంగా ఉండాలి. మీ వద్ద ఈ డాక్యుమెంట్స్ లేకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అప్పుడు మీరు భారీగా జరిమానా చెల్లించవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ వద్ద ఈ పత్రాలు లేకపోతే వేల రూపాయల్లో జరిమానా పడుతుంది. కాబట్టి ఈ పత్రాలు మీ వద్ద ఉండాల్సిందే. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా మీ వద్ద ఫిజికల్ లైసెన్స్ లేకపోయినా ఇబ్బంది లేదు.
డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా అవసరమైన అన్ని పత్రాలను ఒకేచోట పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్, ఎంపరివర్తన్ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ రెండు యాప్‌లలో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సురెన్స్ పత్రాలను అప్ లోడ్ చేయవచ్చు. అవసరమైనప్పుడు వీటిని వినియోగించవచ్చు. ఈ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. మీరు digilocker, mparivahan యాప్స్‌ను కలిగి ఉంటే అవసరమైన అన్ని పత్రాలను అందులో నిల్వ చేస్తే, మీరు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా డ్రైవ్ చేయవచ్చు.

మీరు ఈ యాప్స్‌లో మీ పత్రాలను అప్ లోడ్ చేస్తే, మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ మరిచిపోయినా ఇబ్బంది ఉండదు. ఈ యాప్స్ సాయంతో మీతో మూవింగ్ షాప్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ను తీసుకు వెళ్లవలసిన అవసరం లేదు. ప్రయాణంలో డ్రైవర్ వద్ద నాలుగు పత్రాలు తప్పనిసరి. లైసెన్స్, ఆర్సీ. వీటిని వ్యాలెట్‌లో అప్ లోడ్ పెట్టవచ్చు. బీమా, పొల్యూషన్ పేపర్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి వాటిని వ్యాలెట్‌లో పెట్టలేం.


Click it and Unblock the Notifications