చాలా మంది తక్కువ జీతం వస్తోందని లేదా చేతిలో ఎక్కువ డబ్బు లేదని పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. "వేలల్లో పొదుపు చేస్తే కోట్లు ఎలా వస్తాయి?" అని జోకులు వేస్తుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ రంగంలో నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (Nippon India Growth Mid Cap Fund) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి సంపదను సృష్టిస్తుందో ఈ ఫండ్ నిరూపించింది.

కాంపౌండింగ్ మ్యాజిక్: 7 లక్షలు 5 కోట్లు ఎలా అయ్యాయి?
ఈ ఫండ్ గత 30 ఏళ్లలో సగటున 22.5% కంటే ఎక్కువ వార్షిక రిటర్న్స్ (CAGR) అందించింది. పూర్తి లెక్కలు ఓసారి చూద్దాం.
- మీరు 1995లో ఫండ్ ప్రారంభమైనప్పుడు నెలకు కేవలం రూ.2,000తో సిప్ (SIP) మొదలుపెట్టారనుకుందాం.
- ఈ 30 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కేవలం రూ.7,20,000 మాత్రమే.
- ఇప్పుడు ఆ రూ.7.2 లక్షల విలువ నేడు అక్షరాలా రూ.5.37 కోట్లకు పైగా పెరిగింది.
ఇదంతా కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్.. అంటే సరైన ఫండ్‌ను ఎంచుకుని చాలా కాలం పాటు ఓపికగా ఉండటం వల్లే సాధ్యమైంది.
ఫండ్ వివరాలు.. పనితీరు..
- ఫండ్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 8, 1995
- మొత్తం ఆస్తులు (AUM): రూ.41,268 కోట్లు
- NAV (నెట్ అసెట్ వ్యాల్యూ): రూ.4,216.35 (డిసెంబర్ 3, 2025 నాటికి)
- ఎక్స్‌పెన్స్ రేషియో: డైరెక్ట్ ప్లాన్‌పై కేవలం 0.74% మాత్రమే.
- లిక్విడిటీ: దీనికి లాక్-ఇన్ పీరియడ్ లేదు. అయితే నెల లోపు డబ్బు విత్ డ్రా చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది.
ఏయే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి?
ఈ ఫండ్ ప్రధానంగా ఫోర్టిస్ హెల్త్‌కేర్, బిఎస్ఇ (BSE), చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఆటో కాంపోనెంట్స్, బ్యాంకింగ్, ఫార్మా, కంజ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో ఈ ఫండ్ బలమైన పట్టు కలిగి ఉంది.
ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు?
ఇది ఒక 'మిడ్-క్యాప్' (Mid-cap) ఫండ్. అంటే మధ్యతరహా కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఇందులో రిస్క్ తీసుకునే వారు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మిడ్-క్యాప్ కంపెనీలు రిస్క్‌తో కూడుకున్నవి, కానీ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కనీసం 5 నుండి 10 ఏళ్ల పైన పెట్టుబడి పెట్టగలిగే వారికి ఇది సరైన ఛాయిస్. వీరితోపాటు నెలకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టగల మధ్యతరగతి వారు కూడా దీని ద్వారా అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు.
మొత్తంగా డబ్బును త్వరగా రెట్టింపు చేసే స్కీమ్స్ వెనుక పరిగెత్తే కంటే.. నమ్మకమైన మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న వయస్సు నుండే పెట్టుబడి మొదలుపెట్టడం సరైన నిర్ణయం అని ఈ ఫండ్ పెర్ఫామెన్స్ రుజువు చేస్తుంది. మీ దగ్గర ఉన్నది చిన్న మొత్తమే కావొచ్చు, కానీ దానికి 'సమయం' అనే ఇంధనం తోడైతే.. అది కోట్లలో సంపదను సృష్టిస్తుంది.
( ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications