ఉద్యోగులకు గుడ్‌న్యూస్. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్‌ను పెంచేందుకు ఈపీఎఫ్ఓ ఓ కొత్త ప్లాన్‌ను తీసుకు రావాలని చూస్తోంది. ఇందుకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 (EPS-95) కింద కనీస పెన్షన్ పెంచాలని ఎప్పటి నుండో శాలరైడ్ నుండి డిమాండ్ ఉంది. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ ప్లాన్ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. జమ చేసే సొమ్ము ఆధారంగా ఈ ఫిక్స్డ్ పెన్షన్ మొత్తాలు ఉంటాయి.

అందుకే పరిమితి పెంపుకు డిమాండ్
ప్రస్తుతం ఈపీఎస్‌లో ఉద్యోగి వాటాగా కనీస వేతనంలో 12 శాతం ఉంది. మరో 12 శాతం కంపెనీ జమ చేస్తుంది. నెలవారీ పెన్షన్ రూ.15,000 దాటరాదు. గరిష్టంగా పెన్షన్ ఫండ్‌కు చేరే నెలవారీ మొత్తం రూ.1250గా ఉంటోంది. ప్రస్తుతం ఈపీఎస్‌కు జమ అవుతున్న మొత్తాలపై పన్ను లేదు. దీంతో ఈ పరిమితిని పెంచాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదనపు పెన్షన్‌తో ఊరటనివ్వాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఫిక్స్డ్ పెన్షన్
న్యూ ఫిక్స్డ్ పెన్షన్ స్కీమ్‌ను ఈపీఎఫ్ఓ సిద్ధం చేసింది. ఇందులో ఫిక్స్డ్ పెన్షన్ మొత్తం ఉంటుంది. కాబట్టి బెనిఫిషియరీ తమకు కావాల్సిన పెన్షన్ ప్రకారం కాంట్రిబ్యూట్ చేయవచ్చు. కొత్త స్కీంలో ఎవరైనా ఫిక్స్డ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. సెల్ఫ్-ఎంప్లాయిడ్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈపీఎఫఓ ఇప్పుడు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ఆప్షన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈపీఎస్ పూర్తిగా పన్నురహితం. ప్రస్తుతం అత్యధిక నెలవారీ డొనేషన్ పరిమితి రూ.1250గా ఉంది. అలాంటి సందర్భాలలో అదనపు పెన్షన్‌ను ఎంచుకోవచ్చు.

కాలిక్యులేషన్ ఎలా?
పెన్షన్ కాలిక్యులేషన్ ఇలా ఉంటుంది... మంత్లీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ x ఈపీఎస్ అకౌంట్‌లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాంట్రిబ్యూషన్ /70= ఈపీఎస్ కాలిక్యులేషన్ ఫార్ములా.
ఒక వ్యక్తి నెలవారీ వేతనం రూ.15000 ఉంటే, 30 ఏళ్లు వర్క్ చేస్తే, నెలవారీ పెన్షన్ 15,000X30/70=రూ.12,857.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications