సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) నిబంధనలు మారాయి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింగ్ చేయకుంటే కంపెనీ లేదా యజమాని వాటా జమకాదు. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది. UAN-ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ, కంపెనీ వాటాను మాత్రం పొందలేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్-ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంతకుముందు ఈపీఎఫ్-ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వరకు గడువు ఉంది. అయితే వివిధ కారణాలతో ఈపీఎఫ్ఓ.. ఆధార్ లింకింగ్ గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. ఈపీఎఫ్ఓలో ఉద్యోగికి కరోనా అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ ఇన్సురెన్స్, ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కంటే అధిక వడ్డీ రేటు వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి.
ఈపీఎఫ్-ఆధార్ లింకింగ్ ఇలా...
- పీఎఫ్ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.
- మీ UAN, ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.

- జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి.
- ఓటీపీని పూర్తి చేసి జెండర్‌ను ఎంచుకోవాలి.
- ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాలి.
- మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీకరణ ఎంపికను ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నెంబర్‌కు మరో ఓటీపీ వస్తుంది.
- రెండో ఓటీపీని నమోదు చేయాలి.
- ఈ ఈపీఎఫ్, UAN ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
ఆధార్ కార్డుతో పాన్/EPFO అనుసంధాన సదుపాయాల్లో ఎలాంటి అంతరాయం లేదని ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పేర్కొంది. అన్ని సేవలు స్థిరంగా ఉన్నట్లు, సక్రమంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఆధార్‌తో పాన్, ఈపీఎఫ్ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తల నేపథ్యంలో UIDAI మూడు రోజుల క్రితం పైవిధంగా స్పందించింది. గతవారం రోజులుగా తమ వ్యవస్థల్లో అవసరమైన భద్రతాపరమైన మెరుగులు జరుగుతున్నాయని, ఆ సమయంలో కొంత మేర సేవల్లో అంతరాయం కలిగిందని తెలిపింది. అది కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎన్‌రోల్‌మెంట్, మొబైల్ అప్ డేషన్ సర్వీసుల్లో ఇబ్బంది తలెత్తిందని, ఇప్పుడు అన్నీ పని చేస్తున్నాయని UIDAI తెలిపింది.
అప్‌డేషన్ ప్రారంభమైన గత తొమ్మిది రోజుల్లో 51 లక్షల మంది నమోదు చేసుకున్నారని, సగటున రోజుకు 5.68 లక్షల సేవలు అందుకున్నారని తెలిపింది. కాబట్టి పాన్, ఈపీఎఫ్‌తో ఆధార్ అనుసంధానంలో UIDAI వ్యవస్థలో అంతరాయం కలిగిందన్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అథెంటికేషన్ ఆధారిత సదుపాయంతో కూడిన ఆధార్-పాన్, ఈపీఎఫ్ఓ లింకేజీకి సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేవని UIDAI ప్రకటించింది. ఆధార్ అనేది UIDAI జారీ చేసే 12 అంకెల ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. పాన్ నెంబర్ అనేది ఆదాయపు పన్ను శాఖ కేటాయించిన పది అంకెల అల్పాన్యూమరిక్ నెంబర్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్, పాన్ లింక్ తప్పనిసరి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications