రూ.5 లక్షల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై పన్ను మినహాయింపు, ఎవరికి ప్రయోజనమంటే?
అధిక వేతనం ఉన్న చాలామంది మధ్యతరగతి కుటుంబ సభ్యులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి 'డబుల్' బొనాంజా ప్రకటించింది. పీఎఫ్‌లో వడ్డీ పైన పన్ను మినహాయింపు పొందడానికి పరిమితిని కొన్ని నిర్దిష్ట కేసుల విషయంలో గరిష్టంగా రూ.5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక బిల్లుపై మగళవారం లోకసభలో జరిగిన చర్చకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ పీఎఫ్ పరిమితి అంశాన్ని ప్రస్తావించారు.

పీఎఫ్ వడ్డీపై పన్ను
పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు, యాజమాన్య వాటా కలుపుకొని ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అంశానికి సంబంధించి మంగళవారం లోకసభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భగా నిర్మలమ్మ మాట్లాడారు. పీఎప్ పరిమితి గురించి ప్రస్తావించారు.

వారికి పరిగణలోకి తీసుకోం
చట్ట ప్రకారం ఉద్యోగి మూలవేతనంపై 12 శాతం వరకు యాజమాన్యం తన వాటాగా పీఎఫ్‌లో జమ చేస్తుందని, యాజమాన్యాలు ఒకవేళ ఇంతకు మించి మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తే అప్పుడు తాజా పరిమితిగా ప్రకటించిన రూ.5 లక్షలకు ఆ మొత్తాన్ని పరిగణనలో తీసుకోమని స్పష్టం చేశారు. చందాదారుని పీఎఫ్ ఖాతాకు యాజమాన్యాలు తమ వాటా కంటే అదనంగా జమ చేయనప్పుడే ఏటా రూ.5 లక్షల మొత్తం వరకు పీఎఫ్ జమలపై వడ్డీకి పన్ను మినహాయింపు కొనసాగిస్తామని తెలిపారు.

ఎవరికి ప్రయోజనం
రూ.2.50 లక్షల కంటే తక్కువ పీఎఫ్‌ను ప్రతి సంవత్సరం జమ చేసేవారు 92 శాతం నుండి 93 శాతం వరకు ఉంటారని, వారికి పన్నురహిత వడ్డీ లభిస్తుందన్నారు. ఈపీఎఫ్ పన్ను పరిమితి పెంపు నిర్ణయం బేసిక్ యాన్యువల్ శాలరీ రూ.41.66 లక్షలు ఉన్నవారికి లేదా మొత్తం శాలరీ అమౌంట్ రూ.83 లక్షలు ఉన్నవారికి ప్రయోజనం.


Click it and Unblock the Notifications