నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను అక్టోబర్ నుండి అమలులోకి తీసుకు రానుందా? అంటే అవునని వార్తలు వస్తున్నాయి. నాలుగు కొత్త కార్మిక చట్టాలను అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగుల వర్కింగ్ హవర్స్ 9 గంటల నుండి 12 గంటలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కొత్త కార్మిక చట్టం అమలు తర్వాత పని గంటలు పెరగవచ్చు. అయితే ఈ పని గంటలతో పాటు ఉద్యోగుల వేతనం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి తేవడంతో పాటు ఈ కొత్త కార్మిక చట్టాల్లో కొన్ని సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
డ్రాఫ్ట్ కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఉద్యోగుల అలవెన్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టైమ్ రూల్స్ కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కార్మిక చట్టం ప్రకారం పదిహేను నిమిషాలకు మించి అదనంగా పని చేస్తే దానిని ఓవర్ టైమ్ కిందకు లెక్కిస్తారు. అప్పుడు కంపెనీలు ఓవర్ టైమ్ వేతనం చెల్లించవలసి ఉంటుంది. 15 నిమిషాలు మించితే 30 నిమిషాలు ఓవర్ టైమ్ చేసినట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ కొత్త చట్టాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మార్పులు, చేర్పులకు సిద్ధమవుతోందట. ఈ సంప్రదింపులు అక్టోబర్ నెలలోపు పూర్తి చేసి, అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రాథమిక వేతనం పెంపు పీఎఫ్ పైన కూడా ఆధారపడుతుంది. బేసిక్ పెరిగితే అప్పుడు పీఎఫ్‌కు క్రెడిట్ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అప్పుడు టేక్ హోమ్ వేతనంలో కోత ఏర్పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రాట్యుటీ, పీఎఫ్‌లోకి క్రెడిట్ అయ్యే మొత్తం పెరిగితే, ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది. పీఎఫ్, గ్రాట్యుటీ పెరుగుదల అంటే కంపెనీల ఖర్చు కూడా పెరుగుతోంది. ఉద్యోగుల బేసిక్ శాలరీ పెరిగితే, పీఎఫ్‌కు క్రెడిట్ అయ్యే మొత్తం పెరగడం వల్ల యాజమాన్యం సహకారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగి వాటాతో సమానంగా యాజమాన్యం పీఎఫ్‌కు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే యజమాని పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది.

కొత్త లేబర్ కోడ్‌లో ప్రాథమికంగా ఎన్నో అంశాలు
కేంద్రం కొత్త లేబర్ కోడ్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసినట్లు ఈ ఏడాది ప్రారంభం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత డ్రాఫ్ట్ ప్రకారం ఉచిత మెడికల్ చెకప్, వారానికి 4 రోజుల వర్కింగ్ డేస్ వంటి అంశాలు ఉన్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ నాలుగు లేబర్ కోడ్స్ నిబంధనలను త్వరలో ఖరారు చేసే ప్రక్రియను త్వరలో పూర్తి చేసే అవకాశాలు పేర్కొన్నారు. వీటికి ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత లేబర్ కోడ్స్‌తో సంస్థలు వారానికి నాలుగు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ, పని గంటలు 48 గంటలుగానే ఉండనుందని గతంలో లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ అపూర్వ చంద్ర తెలిపారు. లేబర్ కోడ్స్‌కు సంబంధించి రాష్ట్రాలతో ఏకకాలంలో సంప్రదింపులు జరిగాయి.
'కొత్త లేబర్ కోడ్ డ్రాఫ్ట్ ప్రకారం వర్కింగ్ డేస్ అయిదు రోజుల కంటే తక్కువకు రావచ్చు. ఇది నాలుగు అయితే మూడు పెయిడ్ హాలీడేస్ ఇవ్వాలి. కనుక ఇది ఏడు రోజుల వారంలో దీనిని 4 లేదా 5 లేదా 6 పని దినాలుగా విభజించాల 'అని చంద్ర నాడు చెప్పారు. అయితే 48 గంటల వారపు పని గంటల పరిమితి అలాగే ఉంటుందన్నారు. రోజుకు పన్నెండు గంటల పనితో పాటు, మూడు రోజులు వేతనంతో కూడిన సెలవుల అంశాన్ని కార్మిక సంఘాల వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని దానిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. కంపెనీలలో సాధారణంగా వారానికి గరిష్టంగా 48 గంటల పనివేళలు ఉంటాయి. రోజుకు 8 గంటలు పని చేస్తే వారానికి ఆరు పని రోజులుగా ఉంటాయని, అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులతో రోజుకు 12 గంటల పనిని చేయించుకుంటే వారానికి నాలుగు పనిదినాలు, మిగతామూడు రోజులు సెలవు రోజులుగా ఉంటాయని ఇదివరకే వార్తలు వచ్చాయి.
గ్రాట్యుటీపై కొత్త వేతన కోడ్ ప్రభావం
కొత్త వేతన కోడ్ అమలు చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగులు వారి జీతాలు పునర్మిణామవుతాయి. కంపెనీలు కనీసం 50 శాతం వేతనాన్ని బేసిక్ శాలరీగా చెల్లించాలి. బేసిక్ శాలరీ తక్కువగా ఉంటే కనుక పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, కోడ్ ఆన్ వేజెస్‌కు అనుగుణంగా బేసిక్ వేతనాన్ని సవరించవలసి ఉంటుంది. ప్రాథమిక వేతనంలో పెరుగుదల నేపథ్యంలో పీఎఫ్‌తో పాటు గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.
శాలరీ రీస్ట్రక్చర్ నేపథ్యంలో వేతనాలు పెరిగి ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులో పెరుగుదలకు దారి తీస్తుందని, ఏదేమైనా గ్రాట్యుటీని లెక్కించేందుకు కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 కింద అదే విధంగా ఉంది. ఉద్యోగం మానేసినా, రిటైర్ అయినా నెలలోపు గ్రాట్యుటీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ కంపెనీ గ్రాట్యుటీ ఇవ్వకపోతే తక్కువ ఇవ్వజూపినా దీనిపై అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications