డెబిట్, క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్‌ను మరింత సురక్షితం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనలు గతంలోనే జారీ అయ్యాయి. అయితే బ్యాంకులు ఇందుకు సిద్ధం కాకపోవడంతో అమలు గడువును పొడిగిస్తూ వచ్చారు. కొత్తగా జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డు ఏటీఎం కేంద్రాలు, పాయింట్ ఆఫ్ సేల్(PoS) యంత్రాల్లో పని చేస్తాయి. మన దేశానికి వెలుపల ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలంటే కస్టమర్లు తమ బ్యాంకును సంప్రదించి అందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది.

కార్డు వినియోగించకుంటే..
డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఏ సేవలు అందుబాటులో ఉండాలి, ఎలాంటి సేవలను నిలిపివేయాలి అనేది ఖాతాదారుడి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఇంతవరకు ఒక్కసారైనా వినియోగించని కార్డుల విషయంలో ఆన్‌లైన్ చెల్లింపుల సదుపాయాన్ని నిలుపుదల చేయాలని ఆర్బీఐ నిర్దేశించింది. చెల్లింపుల పరిమితి మార్చుకోవడానికి, చెల్లింపు సేవలను వినియోగించడానికి/నిలిపివేయడానికి 24X7 పద్ధతిలో కస్టమర్‌కు అవకాశం ఉంటుంది.

అందుకే ఈ కొత్త నిబంధనలు
ప్రీపెయిడ్ గిఫ్డ్ కార్డ్స్‌కు ఈ నిబంధనల వర్తించవు. క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లలోనే పని చేస్తాయి. అది కూడా ఇండియాలోనే. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకును సంప్రదించాలి. ఈ సేవలు డిఫాల్టుగా అందుబాటులోకి రావు. భారత్ వెలుపల ట్రాన్సాక్షన్స్ కోసం ఎనేబుల్ చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ మోసాలు తగ్గించేందుకు ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చింది.

స్విచ్చాఫ్ చేసుకోవచ్చు
కస్టమర్ల వద్ద ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌కు అనుమతించాలనే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అవసరమైతే డీయాక్టివేట్ చేయవచ్చు. కస్టమర్ తన కార్డును ఆన్‌లైన్, ఇంటర్నేషనల్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహణకు ఉపయోగించకుంటే ఆ కార్డును బ్యాంకు డిజబుల్ చేయవచ్చు. కార్డును లేదా ప్రత్యేక ఏటీఎం, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ను స్విచ్చాన్ లేదా స్విచ్చాఫ్ చేసుకునే సదుపాయం కస్టమర్లకు ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చు. దేశంలో ఇప్పటికే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కాంటాక్ట్‌లెస్ కార్డులు జారీ చేస్తున్నారు. వీటిని డిజబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవనచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications