అక్టోబర్ 1 నుంటి కొత్త ఆటో డెబిట్ రూల్: ఆటంకాలు ఏర్పడే ఛాన్స్

డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా బిల్లులు, ఇతర చెల్లింపులు ఆటో డెబిట్ ద్వారా చేస్తుంటే ఇది మీకోసమే. ఎందుకంటే వచ్చే నెల 1వ తేదీ నుండి ఇందుకు సంబంధించిన నిబంధనల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్పులు చేపడుతోంది. చాలామంది క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్స్ తమ పవర్, గ్యాస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి), ఇన్సురెన్స్ చెల్లింపులు ఇలా పలు సేవలకు ఆటోపేమెంట్ సూచనలను ఏర్పాటు చేసుకొని ఉంటారు అయితే అక్టోబర్ 1వ తేదీ నుండి ఇలా జరగదు.

ఇప్పటికే బ్యాంకులు ఈ మేరకు తమ కస్టమర్లకు సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన రికరింగ్ పేమెంట్ మార్గదర్శకాల ప్రకారం మీ కార్డ్స్ పైన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ద్వారా చేస్తున్న ట్రాన్సాక్షన్స్‌ను ఇక నిర్వహించడం కుదరదని, మీరు నేరుగా మర్చంట్‌కే మీ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయగలరని బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం అందిస్తున్నాయి.

బ్యాంకులు సమాచారమిస్తున్నాయి

బ్యాంకులు సమాచారమిస్తున్నాయి

HDFC బ్యాంకు ఇప్పటికే తమ కస్టమర్లకు మార్పుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు కూడా కస్టమర్లకు ఈ విషయాన్ని చేరవేస్తున్నాయి. ఆటో డెబిట్ కార్డ్ పేమెంట్ మార్పులకు సంబంధించి సమాచారం ఇస్తున్నాయి. ఆగస్ట్ 2019లోనే ఆర్బీఐ ఈ కొత్త నిబంధనను ప్రకటించింది. డిసెంబర్ 2020లోగా వాటిని అమలు చేయాలని సూచించినప్పటికీ, మరింత గడువు ఇచ్చింది. దీనిని మార్చి 31, 2021కి పెంచింది. ఆ తర్వాత బ్యాంకుల సంఘం(IBA) విజ్ఞప్తితో అక్టోబర్ 1, 2021 వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆలస్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

మార్పులు ఇవే...

మార్పులు ఇవే...

కొత్త నిబంధనల ప్రకారం అన్ని రికరింగ్ ట్రాన్సాక్షన్స్‌కు అదనపు అనుమతి అవసరం. రూ.5000కు మించిన చెల్లింపులకు ప్రతిసారి వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP)తో కస్టమర్ దానిని ధ్రువీకరించాలి. ఇది అన్ని క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌కు వర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ కార్డ్స్ పైన ఉంటుంది. ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం 24 గంటల ముందు బ్యాంకులకు ఖాతాదారులు ప్రీ-డెబిట్ సందేశం పంపిస్తే ఆటో డెబిట్ పేమెంట్స్ పూర్తి అవుతాయి. రూ.5,000 దాటిన ఆటోమేటెడ్ పేమెంట్స్‌కు సంబంధిత ఖాతాదారు స్వయంగా ఓటీపీ ద్వారా ధృవీకరించాలి.

బ్యాంకుల సూచన

బ్యాంకుల సూచన

ఆటో డెబిట్స్‌కు సంబంధించి ఆర్బీఐ నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేయాల్సిన నేపథ్యంలో HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

అక్టోబర్ 1వ తేదీ నుండి సంబంధిత ఖాతాదారులు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేస్తేనే ఆటో డెబిట్స్‌ను అనుమతిస్తామని HDFC ఇప్పటికే ప్రకటించింది. మర్చంట్ వెబ్ సైట్, యాప్, HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ నిర్వాహకులకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆర్బీఐ రికరింగ్ పేమెంట్ మార్గదర్శకాల ప్రకారం మీ యాక్సిస్ కార్డ్స్ పైన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఇక నిర్వహించలేమని, మీరు నేరుగా మర్చంట్‌కే మీ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలని యాక్సిస్ బ్యాంకు సూచించింది.

అనుమతి లేకుండా జరగదు

అనుమతి లేకుండా జరగదు

కస్టమర్‍‌కు చెందిన బ్యాంకు ఖాతాలో ఏవైనా బిల్లు చెల్లింపులకు స్టాండింగ్ ఇన్‌‍స్ట్రక్షన్స్ నమోదయి ఉంటే వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే బ్యాంకు ఖాతా ద్వారా చేసే మ్యూచువల్ ఫండ్ సిప్స్, ఈఎంఐలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నిబంధనలు కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే స్టాండింగ్ ఇన్‌‍స్ట్రక్షన్స్‌కు మాత్రమే వర్తిస్తాయి.

వీటిపై ఉండే ఇన్‌‍స్ట్రక్షన్స్‌ను ప్రాసెస్ చేయబోరు. అందుకే తప్పనిసరిగా అదనపు ధృవీకరణ అవసరం. తప్పనిసరి నమోదు, సవరణ, తొలగింపు అదనపు ధృవీకరణ అవసరం. డెబిట్‌కు 24 గంటల ముందే వినియోగదారుకు ప్రీ-డెబిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో లింక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. వీక్షించడం, మార్చడం, రద్దు వంటివి చేయవచ్చు. గరిష్ట మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. మీ అనుమతి లేకుండా ట్రాన్సాక్షన్ జరగదు. అంటే కస్టమర్ ఆమోదం లేకుంటే లేదా రిప్లై ఇవ్వకుంటే ట్రాన్సాక్షన్ పూర్తవదు.

ఆటంకం ఏర్పడవచ్చు, వీరిపై ప్రభావం

ఆటంకం ఏర్పడవచ్చు, వీరిపై ప్రభావం

కాగా, ఈ కొత్త నిబంధనను కేంద్ర బ్యాంకు ఇచ్చిన గడువులోగా అన్ని బ్యాంకులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈజీ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయని, కానీ అక్టోబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ కొత్త నిబంధనల ప్రారంభంలో కస్టమర్లకు ఆటంకాలు కలిగించవచ్చునని అంటున్నారు. ప్రముఖ బ్యాంకులు రేజర్ పే, బిల్ డెస్క్ వంటి వాటితో కలిసి పని చేస్తున్నాయి.

ఆటో డెబిట్ నియమాలు ఆటో బిల్ పేమెంట్స్ (కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు), ఓటీటీ చందాలు, ఇతర ఆన్ లైన్ సేవల కోసం కార్డ్స్ ఆటో ట్రాన్సాక్షన్స్ పైన ప్రభావం చూపుతాయి. ఇంటర్నెట్ మర్చంట్స్ గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సహా ఇంటర్నెట్ వ్యాపారులు కస్టమర్లకు కొత్త నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు యూట్యూబ్ ప్రీమియం కోసం గూగుల్ నుండి రికరింగ్ మంత్లీ పేమెంట్స్ జరగాలంటే ఇక మీ అనుమతి తప్పనిసరి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+