ఓటీటీ ప్లాట్‌ఫాం అంశంలో కస్టమర్ల బ్యాంకు ఖాతా నుండి డబ్బులు వాటంతట అవే కట్ అయ్యే విధానానికి సంబంధించి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆటోమేటిక్ రెన్యూవల్ అక్టోబర్ 1వ తేదీ నుండి కురదని తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. కస్టమర్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే 24 గంటల ముందుగా బ్యాంకులు విధిగా ఖాతాదారుడికి సందేశం పంపించాలి లేదా మెయిల్ రూపంలో సమాచారం అందించాలి. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(AFA) సందేశాన్ని పంపించి, ఖాతాదారుడితో ధృవపర్చుకున్నాక అకౌంట్ నుండి డబ్బులను కట్ చేయాలని సూచించింది.
మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నెలవారీ ప్యాకేజీ పూర్తవగానే సబ్‌స్క్రిప్షన్ రెన్యూవల్‌కు వినియోగదారుడి ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది. రూ.5 వేలకు మించి పేమెంట్స్ చేయవలసి వస్తే ఓటీపీని తప్పనిసరి చేసింది. హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాకింగ్ దొంగతనాలను నిలువరించేందుకు AFA నిబంధనను తీసుకు వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అవుతున్న సమయంలో మోసాలకు, ఆన్‌లైన్ దొంగతనాలకు ఆస్కారం ఉందని, అందుకే AFA ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నామని స్పష్టం చేసింది. కార్డ్స్‌తో పాటు UPI, ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్‌స్ట్రుమెంట్స్(PPI) ద్వారా చెల్లింపులకు వర్తిస్తుంది.
ఈ AFA పద్ధతి పేమెంట్స్ ద్వారా భద్రతతో కూడిన డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో మొదటి ట్రాన్‌జాక్షన్, ప్రీ-ట్రాన్‌జాక్షన్ నోటిఫికేషన్, ఉపసంహరణ కోసం AFA తప్పనిసరి అని తెలిపింది. ఇదంతా యూజర్ భద్రత కోసమేనని ఆర్బీఐ పేర్కొంది. ఈ రూల్ అమల్లోకి రాగానే బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో అమలు చేయాలని భావిస్తున్న AFA పద్దతిని, త్వరలో మిగతా అంశాల్లోనూ విస్తరించే విషయం కేవలం పరిశీలనలో ఉందని చెబుతోంది.


Click it and Unblock the Notifications