For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 నెలల్లో దాదాపు 30 స్టాక్స్ 100 శాతం లాభాలు ఇచ్చాయి.. అదరగొట్టింది ఇవే..

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నెలలో భారీ పతనాన్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. కొన్ని స్టాక్స్ ఈ కొద్ది రోజుల్లోనే భారీ లాభాలను నమోదు చేశాయి. గత మూడు నెలల కాలంలో నిఫ్టీ 11,000 పాయింట్ల నుండి 12,000 పాయింట్లను తాకింది. ఈ కాలంలో దాదాపు ముప్పై స్టాక్స్ యాభై శాతం నుండి వంద శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో దాదాపు అన్ని రంగాల స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ మార్చిలో ఆల్ టైమ్ కనిష్టం 7500ను తాకింది. అయితే జూలై 20 నాటికి తిరిగి 11,000 పాయింట్లను తాకింది. దాదాపు మూడు నెలల తర్వాత 12,000 మార్క్‌ను తాకింది.

దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్: తెలంగాణ యూనిట్‌పై అమెరికా వార్నింగ్ లేఖ, శిల్ప షేర్ ధర డౌన్దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్: తెలంగాణ యూనిట్‌పై అమెరికా వార్నింగ్ లేఖ, శిల్ప షేర్ ధర డౌన్

ఈ స్టాక్స్‌పై 100 శాతానికి పైగా రిటర్న్స్

ఈ స్టాక్స్‌పై 100 శాతానికి పైగా రిటర్న్స్

ఈ మూడు నెలల కాలంలో దాదాపు 5 స్టాక్స్ పెట్టుబడిదారులకు రెండింతల లాభాలు ఇవ్వగా, 24 స్టాక్స్ 50 శాతానికి పైగా ఇచ్చాయి. జూలై 20వ తేదీ నుండి అక్టోబర్ 9 మధ్య లారస్ ల్యాబ్స్ స్టాక్ 150 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి. ఆ తర్వాత ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ 139 శాతం లాభాలు ఇచ్చాయి. వెల్స్‌పన్ ఇండియా లిమిటెడ్ 121 శాతం, హిమట్‌సింగ సీడ్ లిమిటెడ్ 119 శాతం, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ 118 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

50 శాతానికి పైగా రిటర్న్స్

50 శాతానికి పైగా రిటర్న్స్

అదానీ గ్రీన్ ఎనర్జీ 95 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 94 శాతం, బిర్లా సాఫ్ట్ 85 శాతం, బీఎన్బీ హౌసింగ్ 84 శాతం, డిష్ టీవీ ఇండియా 77 శాతం, థైరోకేర్ టెక్నాలజీస్ 77 శాతం, కేపీఐటీ టెక్నాలజీస్ 75 శాతం, రెప్కో హోమో ఫైనాన్స్ 72 శాతం, సోమానీ సెరామిక్స్ 69 శాతం, ఐఎప్‌బీ ఇండస్ట్రీస్ 68 శాతం, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 66 శాతం లాభాలు అందించాయి. శ్ట్రైడ్ ఫార్మా, వీఏ టెక్ వాబాగ్ , ్లిస్ జీవీఎస్ ఫార్మా, అఫ్లీ, వారోక్ ఇంజినీరింగ్, బ్లూడార్ట్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, అపోల్ హాస్పిటల్స్, సన్ టెక్ రియాల్టీ, టాటా ఎల్క్సీ, కేపీఆర్ మిల్ 50 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి.

ఆ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే..

ఆ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే..

కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు మార్చిలో భారీ పతనాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 27వేల దిగువకు, నిఫ్టీ 8వేల దిగువకు వచ్చింది. లాక్ డౌన్ సమయంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. జూన్ నుండి కార్యకలాపాలు క్రమంగా తెరుచుకోవడంతో స్టాక్ మార్కెట్లు కూడా అదే స్థాయిలో కోలుకుంటున్నాయి. మార్చి చివరి వారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అయితే రిటర్న్స్ భారీగా వచ్చాయి. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.900 కంటే దిగువకు పడిపోయింది. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఒక్కో షేర్‌కు ఇప్పుడు రూ.2200కు పైగా ఉంది.

English summary

3 నెలల్లో దాదాపు 30 స్టాక్స్ 100 శాతం లాభాలు ఇచ్చాయి.. అదరగొట్టింది ఇవే.. | Nearly 30 stocks rise 50-150 percent in less than 3 months

After hitting a low of 7,500 in March, bulls helped Nifty to reclaim lost glory. Although it is still a bear market rally, but Nifty managed to reclaim 11,000 on July 20.
Story first published: Tuesday, October 13, 2020, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X