NBFC FD రేట్లు 2026: బ్యాంకులను మించి వడ్డీ ఇస్తున్న కంపెనీలు ఇవే, టాప్ లిస్ట్ చూశారా?

ప్రస్తుత మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య, ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన , సురక్షితమైన లాభాలను కోరుకునే వారికి ఎప్పటికీ నమ్మకమైన ఆప్షన్ 'ఫిక్స్‌డ్ డిపాజిట్' (FD). అయితే, ఎఫ్‌డీ అనగానే మనకు మొదట బ్యాంకులు గుర్తొస్తాయి. కానీ 2026లో ట్రెండ్ మారింది! ఇప్పుడు సాంప్రదాయ బ్యాంకుల కంటే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) డిపాజిటర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ కంపెనీలు చాలా ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుండటమే.

ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు సాధారణంగా 6.4% నుండి 7.1% వరకు మాత్రమే వడ్డీ ఇస్తుండగా.. కొన్ని ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు ఏకంగా 8.5% వరకు వడ్డీని కురిపిస్తున్నాయి.

NBFC FD Interest Rates 2026 Which Companies Offer The Highest Returns And Who Tops The List

ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ కంపెనీల లిస్ట్..

  • ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ (Muthoot Capital): ఈ కంపెనీ 3 ఏళ్లు , 5 ఏళ్ల ఎఫ్‌డీలపై ఏకంగా 8.5% వడ్డీని ఆఫర్ చేస్తూ మార్కెట్ లోనే టాప్‌లో నిలిచింది.
  • మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ (Manipal Housing Finance): 1 ఏడాది , 3 ఏళ్ల డిపాజిట్లపై వీరు 8.25% వరకు అత్యధిక వడ్డీని ఇస్తున్నారు.
  • శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance): మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన ఈ సంస్థ సాధారణ ఇన్వెస్టర్లకు 7.6%, అలాగే సీనియర్ సిటిజన్లకు 8.1% భారీ వడ్డీని అందిస్తోంది.
  • సుందరం ఫైనాన్స్ (Sundaram Finance): వీరు కొన్ని ప్రత్యేక కాలపరిమితుల (Tenures) పై 7.5% నుండి 8.07% వరకు వడ్డీ రేట్లను ఇస్తున్నారు.
  • బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance): సాధారణ కస్టమర్లకు 7.4% , సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని ఆఫర్ చేస్తోంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా 7% కంటే ఎక్కువ రేట్లను ఇస్తోంది.

బ్యాంకుల కంటే NBFCలు ఎందుకు ఎక్కువ వడ్డీ ఇస్తాయి?

బ్యాంకులకు ఉన్నట్లుగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు తక్కువ వడ్డీతో కూడిన కరెంట్ అకౌంట్లు, సేవింగ్స్ అకౌంట్ (CASA) డిపాజిట్లు భారీ స్థాయిలో ఉండవు. తమ బిజినెస్ , లోన్ల కోసం వీరు మార్కెట్ లో అప్పులు చేయాల్సి ఉంటుంది లేదా కస్టమర్ల డిపాజిట్లపైనే ఆధారపడాలి. అందుకే, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీరు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఇస్తుంటారు.

ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక: ఎక్కువ వడ్డీ వస్తోంది కదా అని ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో పెట్టేయకూడదు. బ్యాంకు డిపాజిట్లకు ఉన్నట్లుగా వీటికి రూ. 5 లక్షల వరకు ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారెంటీ ఉండదు. అందువల్ల, క్రిసిల్ (CRISIL) లేదా ఇక్రా (ICRA) వంటి రేటింగ్ ఏజెన్సీలు 'AAA' (ట్రిపుల్ ఏ) రేటింగ్ ఇచ్చిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.

అదనపు ప్రయోజనాలు & టాక్స్ రూల్స్

చాలా కంపెనీలు సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్ల కంటే 0.25% నుండి 0.50% వరకు అదనపు వడ్డీని (ప్రీమియం) ఇస్తాయి. దీనివల్ల వృద్ధులకు ఇది ఒక అద్భుతమైన నెలవారీ ఆదాయ వనరుగా మారుతుంది. ఇక టాక్స్ విషయానికి వస్తే, బ్యాంక్ ఎఫ్‌డీల లాగే ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం కూడా మీ ఆదాయపు పన్ను (Income Tax) స్లాబ్ ప్రకారం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.

మీరు గనుక రిస్క్ లేకుండా, 8% కంటే ఎక్కువ రిటర్న్స్ పొందాలని ప్లాన్ చేస్తుంటే.. మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న టాప్ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవడం 2026లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+