రియల్ ఎస్టేట్ vs SIP.. పెట్టుబడులకు ఏది ఉత్తమం..

ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచించేప్పుడు చాలా మందికి రెండు ఎంపికలు ముందుకొస్తాయి ఒకటి రియల్ ఎస్టేట్ (ఇల్లు, స్థలాలు), మరొకటి మ్యూచువల్ ఫండ్స్ (SIPలు, ఫండ్ పోర్ట్‌ఫోలియోలు). రెండిటిలో తమ తమ ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే, ఈరోజుల్లో "ఏది వాస్తవంగా మేలైన పెట్టుబడి?" అన్నది ప్రశ్నగా మారింది. అయితే స్టాక్ మార్కెట్ నిపుణుడు రాజ్నీష్ మెహాన్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్‌లో దీన్ని చర్చిస్తూ, ఇవి రెండూ ఎలా వేరుగా పనిచేస్తాయో, ఏది స్మార్ట్‌గానూ, డిసిప్లిన్‌గానూ పని చేస్తుందో స్పష్టంగా వివరించారు. ఆ విశ్లేషణ ఆధారంగా, మనం ఈ వ్యాసంలో రెండు మార్గాలను సమీక్షించి, మీ అవసరాలకు సరిపడే ఉత్తమమైన ఎంపిక ఏదో తెలుసుకుందాం.

Mutual Funds vs Real Estate SIP benefits real estate investment India Rajnish Mehan LinkedIn mutual fund SIP discipline property investment drawbacks wealth creation diversification SIP Real Estate SIP vs Property SIP SIP

పెద్దలు చెబుతారు, "ఇల్లు కొనాలి, భూమి పెట్టుకోవాలి అదే భవిష్యత్తు భద్రత" అని. కానీ కొత్త తరం, ముఖ్యంగా ఉద్యోగం చేసే యువత, వ్యాపారులు, స్టార్టప్ వారసులు మాత్రం "SIPలే సింపుల్, డైరెక్ట్, క్లియర్" అంటున్నారు. మరి వీటిలో నిజంగా ఉత్తమ ఎంపిక ఏది.

రియల్ ఎస్టేట్:
ఇల్లు, ప్లాట్, భూమి వంటి స్థిర ఆస్తులపై మనవాళ్లకి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. "ఒక సొంత ఇల్లు" కలను నెరవేర్చుకోవడం చాలామందికి జీవిత లక్ష్యంగా మారింది. కానీ ఈ కాలంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే చిన్న విషయం కాదు. భారీగా డౌన్ పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లోన్ వడ్డీ రేట్లు అన్నీ కలిపి పెద్ద మొత్తమే పెట్టుబడిగా అవసరం అవుతుంది. అంతేకాదు, ఇల్లు లేదా భూమి కొనగానే లాభం వచ్చేలా ఉండదు. అమ్మే వరకు ఆ పెట్టుబడి నిలిచిపోయినట్టే ఉంటుంది, అంటే అది లిక్విడ్‌గా ఉండదు. అదీ కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చులు, ఆస్తి పన్నులు, అద్దె పెట్టిన వాళ్లతో సమస్యలు వంటి విషయాలు లాభాన్ని తగ్గించవచ్చు. అయినప్పటికీ, ఒక స్థిరత, భద్రత అనే భావన రియల్ ఎస్టేట్‌కి ప్రత్యేకం. "ఇది నా సొంతం" అనే సంతృప్తి దీన్ని ఎంతో మంది కోసం ముఖ్యమైన ఎంపికగా నిలిపేస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్:
ఇక మ్యూచువల్ ఫండ్స్ అంటే నెలనెలా చిన్న మొత్తాలుగా పెట్టే SIP రూపంలో ఉండే ఒక స్మార్ట్ పెట్టుబడి మార్గం. ఇది రూ. 500 లాంటి చిన్న మొత్తంతో కూడా మొదలు పెట్టవచ్చు. ప్రతి నెలా డిసిప్లిన్‌గా ఖర్చు కాకుండా ఏదో ఒక అమౌంట్‌ను పెట్టుబడి చేయడం ద్వారా ఒక మంచి ఆర్థిక అలవాటు కూడా ఏర్పడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన డబ్బు షేర్ మార్కెట్‌, బాండ్లు, డెబ్ట్ ఫండ్స్‌ వంటి వివిధ రంగాల్లో డైవర్సిఫై అవుతుంది అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు, అవసరమైతే ఎప్పుడైనా వీటిని రీడీమ్ చేసుకోవచ్చు, అంటే ఇది లిక్విడ్ ఆస్తిగా ఉంటుంది. అధిక వృద్ధి శాతం (returns), తక్కువ నిర్వహణ ఖర్చులు, క్లియర్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు మ్యూచువల్ ఫండ్స్‌కి మరిన్ని బలాలు ఇస్తాయి.

రాజ్నీష్ మెహాన్ చెప్పినట్టు ఇప్పటి మార్కెట్ పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మునుపటిలా డబుల్ డిజిట్ రాబడులు ఇవ్వడం లేదని చెప్పాలి. ఓ టైమ్ లో భూమి ధరలు వేగంగా పెరిగేవి. కానీ ఇప్పుడు ఆ పెరుగుదల స్లో అయిపోయింది. ఇక మరోవైపు SIPలు చూస్తే నెలనెలా చిన్న మొత్తాలతో పెట్టుబడి చేస్తూ ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్‌ను నిర్మించవచ్చు. వీటికి మెయింటెనెన్స్, టెనెంట్ సమస్యలు లాంటివేమీ ఉండవు. జీతం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ రియల్ ఎస్టేట్‌లో ఉండదు. అందుకే చాలామంది కొత్త తరం పెట్టుబడిదారులు SIPలవైపే మొగ్గు చూపుతున్నారు.

ఇక ఏది బెటర్?
ఈ ప్రశ్నకి సమాధానం... మీ ఆర్థిక పరిస్థితి, జీవిత లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీకు భద్రత అనే భావన ముఖ్యం అయితే, భవిష్యత్తులో ఒక సొంత ఇల్లు ఉండాలన్న కల ఉంటే రియల్ ఎస్టేట్‌ బెటర్ ఎంపిక కావచ్చు. కానీ మీరు నెలనెలా చిన్న మొత్తాలతో, డిసిప్లిన్‌గా పెట్టుబడి చేసి, మెల్లగా లక్ష్యాలను చేరాలని చూస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ (SIP) ఓ స్మార్ట్ మార్గం.

మీ వయస్సు తక్కువగా ఉంటే, పెద్ద మొత్తాలు మేనేజ్ చేయలేకపోతే SIPలు చాలా ఉపయోగపడతాయి. జీతం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కూడా పెంచుకుంటూ ముందుకెళ్లవచ్చు. ముఖ్యంగా, రోజూ ఆస్తి మెయింటెనెన్స్, అద్దె ఇబ్బందులు లాంటి డైలీ టెన్షన్లకు దూరంగా ఉండాలంటే, చిన్న పెట్టుబడులతో పెద్ద లక్ష్యాలను చేరుకునే మార్గం మ్యూచువల్ ఫండ్స్ అవుతాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+