Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.95 శాతం వడ్డీ.. ఎక్కడంటే..!
ఆర్బీఐ రెపో రేటును పెంచిన తర్వాత పలు ఆర్థిక సంస్థలు ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. పైసాబజార్ సమాచారం ప్రకారం ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన ముత్తుట్ క్యాపిటల్ సర్వీసెస్ అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ సంస్థ 3 సంవత్సరాల (అంటే 36 నెలల) డిపాజిట్‌పై ఏడాదికి 8.95 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికెట్ 8 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, బజాజ్ ఫైనాన్స్ 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ పట్టికలో ముత్తుట్ క్యాపిటల్ సర్వీసెస్ మూడు సంవత్సరాల డిపాజిట్‌పై 8.95 శాతంతో అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. దీని వద్ద ఒక సంవత్సరం, ఐదు సంవత్సరాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు వరుసగా 7.90 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి.
మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికెట్ ఒకటి, రెండు, మూడు సంవత్సరాల డిపాజిట్లపై 8% వడ్డీని అందిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ 31 నుంచి 60 నెలల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. శ్రీరామ్ ఫైనాన్స్ మూడు నుంచి ఐదు సంవత్సరాల డిపాజిట్లపై 7.50% వడ్డీని ఇస్తుండగా, కెన్ ఫిన్ హోమ్స్ 36 నెలల కాలవ్యవధికి అదే రేటును చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్ పెట్టుబడిదారులకు వర్తించే సాధారణ వడ్డీ రేటుపై అదనంగా 0.25% నుంచి 0.50% వరకు వడ్డీ లభిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ అదనంగా 0.50% వడ్డీని అందిస్తుండగా, సుందరం హోం ఫైనాన్స్, కెన్ ఫిన్ హోమ్స్ వర్తించే నిబంధనల ఆధారంగా 0.50% వరకు అదనపు వడ్డీని అందిస్తున్నాయి.

శ్రీరామ్ ఫైనాన్స్ మహిళా పెట్టుబడిదారులకు ఏడాదికి అదనంగా 0.05% వడ్డీని, అలాగే గడువు ముగిసిన డిపాజిట్లను అర్హత మేరకు పునరుద్ధరించినప్పుడు ఏడాదికి 0.15% అదనపు వడ్డీని అందిస్తోంది. అంతేకాకుండా పీఎన్బీ హౌసింగ్ పైనాన్స్ సీనియర్ సిటిజన్లకు లభించే 0.25% అదనపు ప్రయోజనం రూ.1 కోటి వరకు ఉన్న డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆఫర్ చేసిన రేట్లు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, పెట్టుబడిదారులు ఇష్యూయర్ క్రెడిట్ రేటింగ్, ఆర్థిక స్థితి, డిపాజిట్ కాలపరిమితి, గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకునే నియమాలు, దీర్ఘకాలిక పన్ను ప్రభావాలను విశ్లేషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టే ముందు పలు అంశాలు గమనించాలని వివరిస్తున్నారు. కంపెనీ స్థిరత్వం, తాజా క్రెడిట్ రేటింగ్‌ను తనిఖీ చేయాలి. వివిధ డిపాజిట్ల కాలపరిమితులను పోల్చాలి. మీకు నిధులు అవసరమైన సందర్భంలో ఎదురయ్యే అవకాశాల గురించి తెలుసుకోవడానికి, జరిమానాలు, లాక్-ఇన్ పీరియడ్‌లు, లాక్-ఇన్ పీరియడ్‌కు ముందు మీ నిధులను విత్‌డ్రా చేసుకునే షరతులను పూర్తిగా తెలుసుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications