మూడేళ్లలో 1000 నుండి 2000కు పైగా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలివే
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు గతవారం మూడు శాతం మేర లాభపడ్డాయి. అయితే 2020 దీపావళి నుండి ఈ దీపావళి వరకు చూస్తే ఈ స్టాక్స్ వరుసగా 61 శాతం, 80 శాతం ఎగిశాయి. నిపుణుల ప్రకారం నిఫ్టీలో కరెక్షన్ ప్రారంభమైంది. మున్ముందు మరింత ఒత్తిడిలో కొనసాగుతుంది. ఇన్వెస్టర్లు ఫ్రంట్ లైన్ ఈక్విటీలను కొనుగోలు చేయడానికి ప్రస్తుత భారీ డిప్స్‌ను అవకాశంగా తీసుకొని ప్రయోజనం పొందవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పోర్ట్‌పోలియోను చూసుకోవాలి. 2021 సంవత్సరం నిస్సందేహంగా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏడాదిగా చెప్పవచ్చు.
2021లో మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 25 శాతం లాభపడింది. మరోవైపు ఫ్రంట్‌లైన్ సూచీలు 60 శాతం లాభపడ్డాయి. ఈసంవత్సరం మంచి రిటర్న్స్ ఇచ్చిన ఐదు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇక్కడ చూడండి.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన అంశం. ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే లాభపడవచ్చు. నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి స్టాక్స్, మార్కెట్ పైన అవగాహనతో, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి.

చెన్నై ఫెర్రోస్ ఇండస్ట్రీస్
చెన్నై ఫెర్రోస్ ఇండస్ట్రీస్ వద్ద అత్యవసర సమయానికి అనుగుణంగా తగినంత నిధులు ఉన్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ గత మూడేళ్ల కాలంలో 74.57 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇదే కాలంలో చెన్నై ఫెర్రోస్ మాత్రం ఏకంగా 2763.71 శాతం రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీ ఇయర్లీ రెవెన్యూ గ్రోత్ రేట్ 471.59 శాతం. త్రీఇయర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 51.58 శాతం. గత మూడేళ్ల కాలంలో కంపెనీ 48..4.4 శాతంతో మంచి ప్రాఫిట్ గ్రోత్‌ను సాధించింది. కంపెనీ రెవెన్యూ .37.73 శాతం పెరిగింది. కంపెనీ రుణాలు రూ.32.06 కోట్లకు తగ్గాయి.

గీతా రెన్యూవబుల్ ఎనర్జీ
గీతా రెన్యూవబుల్ ఎనర్జీకి గత అయిదేళ్లుగా ఎలాంటి రుణాలు లేవు. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఇంటరెస్ట్ ఛార్జీల పైన ఆపరేటింగ్ రెవెన్యూ ఒక శాతం తక్కువగా ఖర్చు చేసింది. లేబర్ ఖర్చుల పైన 50.42 శాతం తగ్గాయి. గత మూడేళ్లలో కంపెనీ నెగిటివ్ రిటర్న్ ఆన్ ఇంటరెస్ట్ నమోదు చేసింది. గీతా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 2010లో ప్రారంభమైంది. మిస్‌లీనియస్ కేటగిరీలో స్మాల్ క్యాప్ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.85.37 కోట్లుగా ఉంది.

TTI ఎంటర్‌ప్రైజ్
గత అయిదేళ్ల కాలంలో కంపెనీకి ఎలాంటి రుణాలు లేవు. కంపెనీ ఇయర్లీ రెవెన్యూ గ్రోత్ రేట్ 433.61 శాతంగా ఉంది. ఈ కంపెనీ 1981లో ఫైనాన్షియల్ సెక్టార్‌లో స్మాల్ క్యాప్ బిజినెస్‌గా ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96.54 కోట్లు. ఇది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయింది. షేర్లు, సెక్యూరిటీలలో పెట్టుడి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్, లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ చేస్తుంది.

నేషనల్ స్టాండర్డ్(ఇండియా)
నేషనల్ స్టాండర్డ్ కంపెనీ యాన్యువల్ సేల్స్ 111.24 శాతానికి పెరిగాయి. ఇన్వెస్టింగ్ ఆపరేషన్స్ పైన రూ.3.25 కోట్లు ఖర్చు చేసింది. ఏడాది ప్రాతిపదికన ఇది 451.46 శాతం పెరిగింది. నేషనల్ స్టాండర్డ్ లిమిటెడ్ 1962లో ప్రారంభమైంది. ఇంజినీరింగ్ రంగంలో ఉన్న ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,343.90 కోట్లు.

JITF ఇన్ఫ్రా లాజిస్టిక్స్
జిందాల్ ITF ఇన్ఫ్రా లాజిస్టిక్స్ (JITF) వాటర్, వాటర్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్న కంపెనీ. అలాగే, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్విప్‌మెంట్ ఫ్యాబ్రికేషన్. జిందాల్ ITF తన అనుబంధ సంస్థల ద్వారా సురక్షిత, సుస్థిరంగా నిలబడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 మూడేళ్లలో 74.57 శాతం రిటర్న్స్ ఇస్తే, జిందాల్ ITF మాత్రం ఏకంగా 1059 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications