For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Muhurat Trading 2021: ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్!

|

ప్రతి దీపావళి పర్వదినం రోజున ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ 2078 ఆరంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తాన పెట్టుబడి సెంటిమెంట్ ఉంటుంది. ఓ మంచి పని చేపట్టేముందు ముహూర్తం చూసుకొని ప్రారంభించడం పరిపాటి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈ రోజున ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదంతా బాగుంటుందని భావిస్తారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఈ రోజున ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ట్రేడింగ్ నిర్వహిస్తారు. సంవత్ 2078 ప్రారంభ సందర్భంగా సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ ఉంటుంది. బీఎస్ఈలో 1957 నుండి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది. ఈ సంవత్సరం కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. ముహూరత్ ట్రేడింగ్ అంటే పరిమిత సమయంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నారు.

ఇవి రూ.800 దాటనున్నాయి

ఇవి రూ.800 దాటనున్నాయి

2021లో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ భారీగా లాభపడింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.729 వద్ద ఉంది. ఏడాది కాలంలో 302 శాతం, ఆరు నెలల కాలంలో 90 శాతం ఎగిసింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 231 శాతం లాభపడింది. ఈ స్టాక్ ఇటీవల అదరగొడుతున్న నేపథ్యంలో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ టార్గెట్ ధరను రూ.890గా అంచనా వేస్తున్నారు.

- కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ప్రస్తుతం రూ.682.70 వద్ద ఉంది. ఏడాది కాలంలో 71.55 శాతం, ఆరు నెలల కాలంలో 20 శాతం ఎగిసింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 70 శాతం లాభపడింది. టార్గెట్ ధరను రూ.830గా అంచనా వేస్తున్నారు.

వర్ల్ పూల్ అదుర్స్

వర్ల్ పూల్ అదుర్స్

ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్ అండ్ సాఫ్టువేర్ సొల్యూషన్స్ సంస్థ హానీవెల్ ఆటోమేషన్ ఇండియా. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.42,600 వద్ద ఉంది. ఏడాది కాలంలో 43 శాతం, ఆరు నెలల కాలంలో 0.07 శాతం ఎగిసింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 15.18 శాతం లాభపడింది. టార్గెట్ ధరను రూ.49,840గా అంచనా వేస్తున్నారు.

వచ్చే దశాబ్దకాలంలో భారత మధ్య తరగతి ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని, అలాగే, కొనుగోళ్లు పెరుగుతాయని, వైట్ గూడ్స్ కంపెనీ ప్రధాన లబ్దిదారుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని స్టాక్స్‌కు ఇది శుభవార్త. ఈ నేపథ్యంలో వర్ల్ పూల్ ఇండియా టార్గెట్ ధరను రూ.2590గా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.2,067.00 వద్ద ఉంది. ఏడాది కాలంలో 0.15 శాతం లాభపడగా, ఆరు నెలల కాలంలో మాత్రం 5.90 శాతం నష్టపోయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 21 శాతం నష్టపోయింది.

క్లీన్ సైన్స్ టెక్

క్లీన్ సైన్స్ టెక్

క్రిటికల్ స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ ఇంటర్మీడియేట్, ఎఫ్ఎంసీజీ కెమికల్స్ అతిపెద్ద తయారీదారులలో ఒకటైన క్లీన్ సైన్స్ టెక్.. చైనా ప్లస్ వన్ పాలసీ ప్రధాన లబ్ధిదారుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆరోగ్యకర వృద్ధి అవకాశాలు, చైనా ప్లస్ వన్ పాలసీ, కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ అతిపెద్ద తయారీదారు. తయారీని విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ టార్గెట్ ధరను రూ.2,350 అంచనా వేస్తున్నారు.

టెక్స్‌టైల్ అండ్ సుగర్ కంపెనీ కేపీఆర్ మిల్స్. మూలధనంపై రాబడిని పెంచేందుకు గార్మెంటింగ్, ఇథనాల్ వ్యాపారంలోకి విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.495.90 వద్ద ఉంది. ఏడాది కాలంలో 237.97 శాతం లాభపడగా, ఆరు నెలల కాలంలో 69.25 శాతం లాభపడింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 184.02 శాతం లాభపడింది. టార్గెట్ ధర రూ.550.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన అంశం. అంతర్జాతీయ, జాతీయ ప్రభావంతో సూచీలు కుప్పకూలవచ్చు.. లేదా పరుగులు పెట్టవచ్చు. కాబట్టి ఇది రిస్క్‌తో కూడుకున్నది. మార్కెట్ పైన పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాలతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

English summary

Muhurat Trading 2021: ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్! | Muhurat Trading 2021: Diwali Stock Portfolio to Invest in Samvat 2078

Indian stock markets have witnessed a stellar bull run over the last one year. The benchmark Sensex and Nifty touched record highs, crossing 60,000 and 18,000 respectively. Bringing big cheers to the investors, Nifty has generated returns in excess of 40 per cent.
Story first published: Thursday, November 4, 2021, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X