క్రిప్టోకరెన్సీ ఎగిసి'పడుతోంది'. రెండు రోజుల క్రితం సెకండ్ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియం 2900 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 24 గంటల్లో 4500 లాభపడింది. అయితే ఇప్పటికీ బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టానికి చాలా దూరంలో ఉంది. గత నెలలో ఓ సమయంలో 64,000 డాలర్లు దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అయితే 2021లో ఎథేర్ భారీగా ఎగిసిపడింది. ఎథేరియం ఫౌంటర్ ఇటీవల భారత్‌కు కోవిడ్ రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు.

ఎథేరియం అదుర్స్
బిట్ కాయిన్, డోజి కాయిన్‌లు 2021లో మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అయితే బిట్ కాయిన్ ఎలా ఎగిసిందో, అదే స్థాయిలో కిందకు వచ్చింది. టెస్లా వంటి కంపెనీల మద్దతుతో తిరిగి పుంజుకుంది. సోమవారం ఎథేరియం ఏకంగా 3,017 డాలర్లకు చేరుకుంది. గత వారం రాణించిన ఈ క్రిప్టో, ఈ వారం ప్రారంభంలోను లాభపడుతోంది.
ఎథేరియం బ్లాక్ చైన్ నెట్ వర్క్ ద్వారా యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(EIB) డిజిటల్ బాండ్ సేల్‌ను ప్రకటించడంతో ఎథేరియం లాభపడుతోంది. ఎథేరియం 2021లో 300 శాతం కంటే ఎక్కువగా ఎగిసింది.

విరాళం
2021 ప్రారంభం నుండి ఎథేరియం 300 శాతం లాభాలు అందించింది. బిట్ కాయిన్ మాత్రం గత నాలుగు నెలల కాలంలో 95 శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. ఎథేరియం కో-ఫౌండర్ విటాలిక్ బుటెరిన్ భారత్‌లో కరోనాపై పోరుకు కొంతమొత్తం కాంట్రిబ్యూట్ చేశారు. రూ.4.5 కోట్ల విలువ కలిగిన సహకారం అందించారు. గత రెండు మూడు రోజులుగా మిగత్ క్రిప్టోకరెన్సీలు స్థిరంగా లేదా స్వల్పంగా లాభపడుతుండగా, ఎథేరియం మాత్రం భారీగా ఎగిసిపడుతోంది.

పుంజుకుంటున్న బిట్ కాయిన్
బిట్ కాయిన్ వ్యాల్యూ పైకి కిందకూ కదులుతోంది. టర్కీ క్రిప్టో నిషేధం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంశం బిట్ కాయిన్ వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతవారం 50వేల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ మళ్లీ కాస్త పుంజుకుంది. నేడు 58వేల డాలర్లు క్రాస్ చేసి 59వేల డాలర్ల దిశగా వెళ్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications