ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయగల స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తోంది. ఈ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్‌కు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తోంది. అయితే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ రిస్క్‌తో కూడుకున్న పెట్టుబడులు. కాబట్టి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఈ బ్రోకరేజ్ సంస్థ యూనియన్ బ్యాంకు, శ్రీరామ్ సిటీ యూనియన్ పైన బెట్టింగ్ వేస్తోంది. ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నాయి.

యూనియన్ బ్యాంకు
ఈ బ్రోకరేజీ సంస్థ యూనియన్ బ్యాంకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ.37 దిగువన ఉంది.ఈ స్టాక్ 46 శాతం ఎగిసి రూ.55కు చేరుకోవచ్చునని ఈ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం యూనియన్ బ్యాంకు ఆరోగ్యకర ప్రదర్శన కనబరుస్తోంది.
ఇతర అధిక ఆదాయాలతో పాటు మార్జిన్స్ పెరగడం, బిజినెస్ గ్రోత్ పెరగడం కనిపిస్తోందని తెలిపింది. యూనియన్ బ్యాంకు ఈపీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.7.9 శాతం కాగా, 2022-23 నాటికి రూ.11.8 శాతంగా అంచనా వేస్తోంది. యూనియన్ బ్యాంకు ప్రాఫిట్ గత త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన భారీగా లాభపడి రూ..11.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం ప్రొవిజన్స్ రూ.35 బిలియన్లుగా ఉన్నాయి.

శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.1856 వద్ద ఉంది. ఈ స్టాక్ కూడా వచ్చే కాలంలో మంచి రిటర్న్స్ అందించవచ్చునని చెబుతోంది. ఎంఎస్ఎంఈ, 2w, పర్సనల్ లోన్స్ వంటి రిస్క్ కలిగిన ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ, అసెట్ క్వాలిటీ సంతృప్తికరంగా ఉంది.

గమనిక..
స్టాక్స్‌లో పెట్టుబడితో ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాసం ఆధారంగా మాత్రమే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు స్టాక్ మార్కెట్ పైన అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications