ఏడాదిలో ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే అదిరిపోయే లాభాలు!

ఇటీవల స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 56,000 పాయింట్లు దాటింది. సెకండ్ వేవ్ సమయంలో 47,000 దిగువకు పడిపోయిన సూచీలు, ఆ తర్వాత పరుగులు పెట్టాయి. ఈ కొద్ది నెలల్లోనే సెన్సెక్స్ దాదాపు 9వేల పాయింట్లు ఎగబాకింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రసంగం కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కమోడిటీ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లు మిశ్రమ ధోరణితో ఉన్నాయి. భారత ఈక్విటీలు మాత్రం ఈ మధ్య దూసుకెళ్తున్నాయి.

సాధారణంగా ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నప్పుడు స్వల్పకాలంలో పెట్టుబడి సరైనది కాదు. అయితే మార్కెట్ పైన అవగాహన కలిగి, స్టాక్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి పెట్టుబడి పెట్టాలి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ P&G హైజీన్ అండ్ హెల్త్ కేర్, బజాజ్ ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చునని సూచిస్తోంది.

1

ఎల్ అండ్ టీ కంపెనీ టార్గెట్ ధరను మోతీలాల్ ఓస్వాల్ రూ.1,950గా పేర్కొంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ షేర్ ధర రూ.1,639.20 వద్ద ఉంది. FY21లో బిల్డింగ్స్ అండ్ పవర్ సెక్టార్స్ పేలవంగా ఉండగా, విదేశీ టీ అండ్ డీ, హైడ్రోకార్బన్స్ సెగ్మెంట్ విభాగాల నుండి బలమైన ఆర్డర్స్ రావడం కలిసి వస్తోంది.

మోతీలాల్ ఓస్వాల్ అంతకుముందు ఎల్ అండ్ టీ టార్గెట్ ధరను రూ.1835గా పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి రూ.1950గా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రభావం కనిపించిందని, సెకండ్ వేవ్ సమయంలో ఎల్ అండ్ టీ కంపెనీ వృద్ధిపై బ్యాలెన్స్ షీట్ బలానికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు.

2

P&G హైజీన్ అండ్ హెల్త్ కేర్ టార్గెట్ ధరను రూ.15,530గా అంచనా వేస్తోంది మోతీలాల్ ఓస్వాల్. ప్రస్తుతం P&G హైజీన్ అండ్ హెల్త్ కేర్ షేర్ ధర రూ.13,737 వద్ద ఉంది. మోతీలాల్ ఓస్వాల్ గతంలో ఈ కంపెనీ స్టాక్ టార్గెట్ ధరను రూ.1835గా పేర్కొంది. ఇప్పుడు దానిని రూ.1950కి సవరించింది. మంచి మార్కెట్ లీడర్‌షిప్, గణనీయమైన అవకాశాలతో వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడింది.

బజాజ్ ఫైనాన్స్

బజాజ్ ఫైనాన్స్

బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ధర ప్రస్తుతం రూ.6,949 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.7,700గా అంచనా వేసింది మోతీలాల్ ఓస్వాల్. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం మ్యూచువల్ ఫండ్‌ను స్పాన్సర్ చేయడానికి జాజ్ ఫిన్ సర్వ్‌కు సెబి అనుమతి ఇచ్చింది. బజాజ్ ఫిన్ సర్వ్ బైరేటింగ్‍‌ను కొనసాగిస్తున్నామని, ఈ స్టాక్ రూ.7700కు చేరుకోవచ్చునని పేర్కొంది. రిటైల్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సురెన్స్, జనరల్ ఇన్సురెన్స్, సెక్యూరిటీస్ ఇండస్ట్రీలో బజాజ్ ఫైనాన్స్ దిగ్గజ సంస్థగా ఉంది.

ఏడాదిలో ఈ కంపెనీల బై-కాల్

ఏడాదిలో ఈ కంపెనీల బై-కాల్

- లార్సన్ & టర్బో టార్గెట్ ధర - టార్గెట్ ధర రూ.15,530. 18 శాతం వృద్ధి

- P&G హైజీన్ అండ్ హెల్త్ కేర్ - టార్గెట్ ధర రూ.7,700. 11 శాతం వృద్ధి

- బజాజ్ ఫైనాన్స్ - టార్గెట్ ధర రూ.1,950. 22 శాతం వృద్ధి

ఈక్విటీలు, ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న అంశం. అనుకోని పరిస్థితుల్లో నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. బ్రోకరేజీ సంస్థ బై-కాల్ ఆధారంగా లేదా ఈ కథనం ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ సరికాదు. నిపుణుల సలహాలతో, స్టాక్స్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+