ముంబై: కరోనా దెబ్బ నుండి ప్రపంచ, ఆసియా, దేశీయ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. గత కొద్ది సెషన్లులోనే సరికొత్త రికార్డులను తాకాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23వ తేదీన పాతాళాన్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ లాక్ డౌన్ సమయంలో దాదాపు అక్కడే కదలాడాయి. అన్-లాక్ నేపథ్యంలో మే నెల నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. 26వేల స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ ఇప్పుడు ఏకంగా 44వేల మార్కును తాకింది. అంటే 9 నెలల కాలంలో సెన్సెక్స్ 18వేల పాయింట్లు ఎగిసింది. గత రెండు నెలలుగా భారీగా ఎగిసినప్పటికీ, సగటున నెలకు 2వేల పాయింట్లు లాభపడింది.

50,000 మార్కుకు సెన్సెక్స్
భారత ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపిస్తోన్న సూచనలు కనిపిస్తోంది. జీఎస్టీ కలెక్షన్ల నుండి దాదాపు ప్రతి అంశంలో కార్యకలాపాలు పుంజుకున్నాయి. కొన్ని రంగాల్లో కరోనా ముందుస్థాయిని దాటాయి. దీనికి తోడు వ్యాక్సీన్‌పై సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. దీంతో పది సెషన్లలోనే 43వేల మార్కును దాటిన సెన్సెక్స్, తాజాగా 44వేలను క్రాస్ చేసింది. 2021 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 50,000 మార్కుకు చేరుకోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అంతకుముందు జూన్ 2021 నాటికి సెన్సెక్స్ 37,300కు చేరుకోవచ్చనని అంచనా వేసింది. ఇప్పుడు దానిని సవరించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి హాఫ్ సెంచరీ దాటవచ్చునని పేర్కొంది.

మరిన్ని రికార్డుల దిశగా... సర్దుబాటు కొట్టిపారేయలేం
ఈ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ (మోర్గాన్ స్టాన్లీ) బీఎస్ఈ సెన్సెక్స్ FY21, FY22, FY23 ఆర్థిక సంవత్సరాలలో ఆదాయ అంచనాలను కూడా వరుసగా 15 శాతం, 10 శాతం, 9 శాతానికి పెంచింది. ఈ కాలంలో సూచీ భారీ లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మార్కెట్లు కొత్త శిఖరాలను తాకుతుండటంతో తిరిగి పడిపోయే అవకాశాలు లేకపోలేదని కూడా పలువురు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయని, కాస్త సర్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

60 శాతం జంప్ చేసిన సూచీలు
కరోనా వైరస్ దేశంలో పెరిగితే సెన్సెక్స్ 37,000 స్థాయికి పడిపోవచ్చునని కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. సెన్సెక్స్ టార్గెట్ 59,000గా పేర్కొంది. 2021లో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్ సూచీలు రాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. గతవారం గోల్డ్‌మన్ శాక్స్ నిఫ్టీ టార్గెట్‌ను 2021 చివరి నాటికి 14,100కు అప్ గ్రేడ్ చేసింది. నోమురా కూడా డిసెంబర్ 2021 నాటికి 13,640 పాయింట్లుగా అంచనా వేసింది. మార్చి కనిష్ట స్థాయి నుండి భారత సూచీలు 60 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇక నవంబర్ నెలలో ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FII)లు 4.15 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతమూడు నెలల కాలంలో ఇది గరిష్టం.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications