కార్పోరేట్ ఎర్నింగ్ సీజన్ అనంతరం మార్కెట్లు వరుసగా మూడు వారాలు లాభాల్లో ముగిశాయి. కాస్త ఎక్కువ, తక్కువ కానీ మొత్తానికి లాభాల్లో క్లోజ్ అయ్యాయి. అయితే ఇదే కాలంలో స్మాల్ క్యాప్స్ అదరగొట్టాయి. సానుకూల ప్రపంచ సంకేతాలు, రుతుపవనాల పురోగతిపై అనుకూలమైన అప్ డేట్ కారణంగా జూన్ 3వ తేదీతో ముగిసిన మూడో వారంలో మార్కెట్ లాభాల్లో ముగిసింది. అస్థిరమైన మార్కెట్ సమయంలోను టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ స్టాక్స్ ఒకటిన్నర శాతం లాభాలను అందించాయి. అయితే బ్యాంకులు, పవర్, హెల్త్ కేర్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ ఐటీ, రియాల్టీ, ఎనర్జీ అత్యధికంగా లాభపడ్డాయి. ఇవి దాదాపు నాలుగు శాతం నుండి ఐదు శాతం ఎగిశాయి.

స్మాల్ క్యాప్ అదుర్స్
బీఎస్ఈ సెన్సెక్స్ 885 పాయింట్లు లేదా 1.6 శాతం ఎగిసి 55,769 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 232 పాయింట్లు లేదా లాభపడి 16,584 పాయింట్లకు చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 257 పాయింట్లు ఎగిసి 22,775 పాయింట్లకు చేరుకుంది. స్మాల్ క్యాప్ సూచీలు 763 పాయింట్లు లేదా 3 శాతం లాభపడి 26,384 పాయింట్లకు చేరుకున్నాయి. దీంతో బ్రాడర్ సూచీలు మంచి ట్రాన్సాక్షన్ సాధించాయి.

670 మంచి రిటర్న్స్
920 స్మాల్ క్యాప్ సూచీల్లో 670 మంచి రిటర్న్స్ అందించాయి. ఇందులో 101 స్టాక్స్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. గత ఐదు సెషన్‌లలోనే రతన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్, మీర్జా ఇంటర్నేషనల్, టింకెన్ ఇండియా డీబీ రియాల్టీ, బిర్లా టైర్స్, హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ, ఎవరెస్ట్ కాంటో సిలిండర్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రేమాండ్, మోంటే కార్లో ఫ్యాషన్స్, ఫైన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, శివ సిమెంట్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ ఏకంగా 20 శాతం నుండి 30 శాతానికి పైగా లాభపడ్డాయి.

15 శాతం రిటర్న్స్
ఎలెకాన్ ఇంజినీరింగ్ కంపెనీ, స్టెర్లింగ్ టూల్స్, బార్బెక్ నేషన్ హాస్పిటాలిటీ, అశోక్ బిల్డ్ కాన్, సుజ్లాన్ ఎనర్జీ, డాలర్ ఇండస్ట్రీస్, రూట్ మొబైల్, జెన్ టెక్నాలజీస్, ఎంఎం ఫోరింగ్స్, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్, కేపీఐటీ టెక్నాలజీస్, లెమన్ ట్రీ హోటల్స్, అయోన్ ఎక్స్చేంజ్, శ్రీ రేణుక సుగర్స్ వంటివి కూడా 15 శాతానికి పైగా లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications