జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనీ సేవింగ్స్ ప్లాన్ లేకుంటే.. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యధిక వడ్డీకి కూడా రుణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మనీ సేవింగ్ ప్లాన్ ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మీ వద్ద తగినంత డబ్బులు ఉంటే ఇబ్బంది లేదు. కానీ డబ్బు ఆదా చిట్కాలు లేకుండా మీ చేతుల్లో డబ్బులు ఉండటం తక్కువ.
కాబట్టి ఉద్యోగి లేదా వ్యాపారవేత్త, ఇతర ప్రొఫెషనల్స్ ఎవరైనా మనీ సేవింగ్స్ ప్లాన్ కలిగి ఉండాలి. పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా వారి పొదుపు సామర్థ్యాలపై అధిక విశ్వాసంతో ఉంటారని పలు సందర్భాల్లో వెల్లడైంది.

సొంత పొదుపు కంటే...
మీ వద్ద డబ్బులు తక్కువ ఉంటే అనవసర ఖర్చులు చేయవద్దు. సొంతగా డబ్బులు పొదుపు చేయడం కాకుండా, ఆటోమేషన్ సహాయంతో పొదుపు ప్రారంభించడం మంచిది. మీరు సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలోనే ఉంచడం ద్వారా, అక్కడి నుండి ఆటోమేటిక్‌గా ఏదైనా ఒక రంగంలో పెట్టుబడి పెట్టేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఇలా చేస్తే కొంతకాలానికి మీ చేతికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. అయితే సొంతగా దాచుకుంటే ప్రయోజనం ఉండదు. అంతేకాదు, పైగా ఏదో అవసరానికి లేదా అనవసరానికి ఉపయోగిస్తారు. ఆందుకే ఆటోమేటిక్ విధానం ద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నాలు చేయాలి.

పీఎఫ్ ఉత్తమ సేవింగ్స్ సాధనం
మనీ సేవింగ్స్‌లో ఉత్తమమైన మార్గాల్లో పీఎఫ్ ఒకటి. ప్రతి నెల అది చిన్న మొత్తంగానే కనిపించవచ్చు. కానీ దానిని అలాగే వదిలేస్తే కొన్నేళ్లకు మీ చేతికి పెద్ద మొత్తం అందుతుంది. ఉద్యోగ భవిష్య నిధికి వచ్చే వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో మంచి వ్యాల్యూ కలిగి ఉంటుంది.
మీ వేతనం నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కాకపోయినప్పటికీ, నెలకు ఉద్యోగ భవిష్య నిధికి సమానమైన డబ్బు ఆదా చేయడం జరుగుతుంది. పీఎఫ్ అకౌంట్‌కు ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటా కూడా కొంత కలుస్తుంది.

ఆటోమేటిక్ సేవింగ్స్
ఆటోమేటిక్ సేవింగ్స్‌లో భాగంగా రికరింగ్ డిపాజిట్ మరో ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. నెలకు రూ.10,000 చొప్పున రికరింగ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఏడాది తర్వాత అవి రూ.1.20 లక్షలకు పైగా అవుతాయి. రికరింగ్ డిపాజిట్ మాత్రమే కాకుండా, ఇతర ఆటోమేటెడ్ పెట్టుబడి సాధనాలు కూడా ఉన్నాయి.
ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం ఆధారంగా బడ్జెట్ వేసుకొని, ఇంటి ఖర్చులు, ఇతర ఖర్చులు పోను మిగతా వాటిని సేవింగ్స్ కోసం వినియోగించాలి. సేవింగ్స్ ప్లాన్ పక్కాగా ఉండాలి. సేవింగ్స్ లేకుంటే మీ నెల వేతనంలో కొంత మొత్తం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. మీ వేతనం రూ.30,000 అయితే, ఇంటి ఖర్చు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు కలిపి రూ.22,000 పోతున్నాయి అని భావిస్తే మిగతా మొత్తాన్ని సేవింగ్స్ కోసం ఉపయోగించాలి.
అది కూడా ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా చూసుకోవాలి. వేతనంలో పది శాతం నుండి ఇరవై శాతం వరకు సేవింగ్స్ కోసం కేటాయించాలి.

ఫైనాన్షియల్ గోల్స్
ఉద్యోగి లేదా వ్యాపారవేత్త, ఇతరులు ఎవరైనా ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోవాలి. అప్పుడే సేవింగ్స్ పైన దృష్టి ఉంటుంది. స్వల్పకాలం లేదా మధ్యస్థ కాలం లేదా దీర్ఘకాలం ఏదైనా.. సేవింగ్స్ అండ్ గోల్ ఉండాలి. అలాగే సరైన సాధనంలో పెట్టుబడి పెట్టాలి. ఇష్టారీతిన పెట్టుబడి సరికాదు. ఏ సాధనంలో పెట్టుబడి పెడుతున్నామో దానిపై అవగాహన ముఖ్యం.
అలాగే, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది కూడా ముఖ్యమే. ఉదాహరణకు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఏ రంగాన్ని, ఏ రంగంలోని ఏ స్టాక్‌ను ఎంచుకోవాలనేది కీలకం. సేవింగ్స్‌ను ఎప్పటికప్పుడు ఎక్కువగా చేసుకోవాలి. అలాగే పన్నురహిత సేవింగ్స్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టాలి. పెట్టుబడి అంటే కేవలం మనీ సేవింగ్ మాత్రమే కాదు.
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ కూడా ఒక రకమైన సేవింగ్స్ సాధనాలే. మీ కుటుంబానికి సరైన బీమాను ఎంచుకోవాలి. హెల్త్ అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సురెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే, లైఫ్ ఇన్సురెన్స్ ఫ్యామిలికీ మద్దతు ఇస్తుంది.

ముందు సేవింగ్స్ చేసి..
పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఆదాయం మైనస్ ఖర్చులు ఈజ్ ఈక్వల్‌టు పొదుపు అనే సూత్రాన్ని పాటిస్తారు. అంటే ఆదాయం నుండి ఖర్చులు మినహాయించి, మిగతా వాటిని సేవింగ్స్ కోసం ఉపయోగిస్తుంటారు. కానీ అలా కాకుండా, మొదట కొంత మొత్తాన్ని పొదుపు కోసం కేటాయించి, మిగిలిన మొత్తంలో ఖర్చులకు వినియోగించుకోవడం మంచిది అని నిపుణుల సూచన.
సేవింగ్స్ కూడా వివిధ సాధనాల్లో ఉండటం మంచిది. కొంత బ్యాంకులో, మరికొంత స్టాక్స్‌లో, ఇంకొంత బంగారంపై, ఫండ్స్‌లో... ఇలా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడిని వైవిధ్యపరచాలి. ప్రతి నెల పది శాతం నుండి ముప్పై శాతం వరకు సేవింగ్ చేయాలి.
చిన్న మొత్తంతో ప్రారంభించినప్పటికి సేవింగ్స్‌ను పెంచుకుంటూ పోవాలి. బ్యాంకుతో పాటు ప్రతి నెల ఎమర్జెన్సీ ఫండ్ కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు సూత్రం కంటే ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు అనే సూత్రం పాటించడం మంచిది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications