డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే.. ఈ 5 అలవాట్లను వెంటనే మార్చుకోండి.

జీవితంలో 20 వ పడిలోకి అడుగుపెట్టగానే వచ్చే ఉత్సాహం, చేతిలో ఆడే మొదటి జీతం.. ఏదో తెలియని లోకంలో విహరింపజేస్తాయి. కానీ, ఇదే వయస్సులో చేసే చిన్న చిన్న తప్పులు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకుర్ వారికో (Ankur Warikoo) తన 20 వ ఏట తను తెలుసుకోలేకపోయిన, ఇప్పుడు యువతకు ఎంతో ఉపయోగపడే ఐదు కీలకమైన మనీ లెసన్స్‌ను పంచుకున్నారు. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడం సాధించవచ్చు.

Money Tips For Young Age Dont Do These Huge Mistakes To Avoid Huge Loss For Financial Success

1. 'బోరింగ్' గా ఉండటమే అసలైన ధనం!

చాలామంది విలాసవంతమైన జీవితం, ప్రతిరోజూ కొత్తదనం కోరుకుంటారు. కానీ అంకుర్ వారికూ ఏమంటారంటే, "బోరింగ్‌గా ఉండటమే ధనవంతుల లక్షణం". అంటే, క్రమశిక్షణతో ఖర్చులను తగ్గించుకుని, అనేక ఆదాయ మార్గాలను (Multiple Income Streams) వెతుక్కోవడం ఒక నిరంతర ప్రక్రియ. ఇది చూడటానికి బోర్ కొట్టవచ్చు కానీ, దీర్ఘకాలంలో ఇదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. దీనికి సమయం పడుతుంది, కానీ పట్టుదలతో ఉంటే సాధ్యమే.

2. మీ జీతం మీ ఉనికి కాదు!

ఉద్యోగంలో వచ్చే జీతం ఎక్కువగా ఉంటే తాము గొప్పవాళ్లమని, తక్కువ ఉంటే పనికిరాని వాళ్లమని చాలామంది ఫీల్ అవుతుంటారు. వారికూ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. "ఎక్కువ జీతం వస్తే మీరు మంచి మనిషి అయిపోరు, అలాగే ఉద్యోగం పోతే మీ విలువ తగ్గిపోదు." జీతం అనేది కేవలం ఒక ఆదాయ మార్గం మాత్రమే, అది మీ వ్యక్తిత్వాన్ని లేదా మీ గుర్తింపును (Identity) నిర్ణయించకూడదు.

3. భాగస్వామి ఎంపిక.. మీ ఆస్తిపై ప్రభావం చూపుతుంది!

మీరు ఎంచుకునే జీవిత భాగస్వామి మీ ఆర్థిక స్థితిని శాసిస్తారు. వారి ఆలోచనలు, ఖర్చు చేసే అలవాట్లు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మీ ఫైనాన్షియల్ నిర్ణయాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అందుకే మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఎంత సంపాదించినా అది నిలవడం కష్టం.

4. డబ్బు అంటే స్వేచ్ఛ.. హోదా కాదు!

చాలామంది సమాజంలో తమ హోదాను (Status) ప్రదర్శించుకోవడానికి ఖరీదైన కార్లు, ఫోన్లు కొంటారు. కానీ డబ్బు యొక్క అసలైన ఉపయోగం 'ఫ్రీడం' ఇవ్వడం. మీకు నచ్చిన పని చేసే స్వేచ్ఛను, నచ్చిన చోట ఉండే స్వేచ్ఛను డబ్బు ఇవ్వాలి తప్ప, కేవలం ఇతరులకు చూపించుకోవడానికి వాడితే ఆ చక్రబంధంలో మీరు చిక్కుకుపోతారు. ఆ ప్రదర్శన పిచ్చికి ఎప్పుడూ అంతం ఉండదు.

5. గిల్ట్ లేకుండా ఖర్చు చేయాల్సినవి ఇవే!

డబ్బు దాచుకోవాలి కదా అని అన్నిటికీ కక్కుర్తి పడకూడదు. కొన్ని ఖర్చుల విషయంలో ఏమాత్రం సిగ్గుపడొద్దు లేదా బాధపడొద్దు. మంచి ఆహారం, నాణ్యమైన షూస్, , ముఖ్యంగా మీ తల్లిదండ్రుల సంరక్షణ కోసం చేసే ఖర్చులను మనస్ఫూర్తిగా చేయాలి. ఇవి జీవితానికి అర్థాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.

చివరగా అంకుర్ వారికో (Ankur Warikoo) మాటల ద్వారా అర్థమయ్యేది ఒక్కటే.. డబ్బును సంపాదించడం ఒక ఎత్తైతే, దానిని మేనేజ్ చేయడం మరో ఎత్తు. మీ 20 ఏళ్ల వయస్సులోనే ఈ అలవాట్లు నేర్చుకుంటే, 30 లేదా 40 ఏళ్ల నాటికి మీరు ఎవ్వరిపై ఆధారపడకుండా గౌరవంగా బతకవచ్చు. కాబట్టి యువత షోలకు పోకుండా, వారికూ చెప్పిన ఈ టిప్స్ పాటించి మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+