For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ కోసం టైమ్ ఉందనుకోవద్దు: 20లో ఈ మనీ సూత్రాలు పాటించాలి

|

ప్రతి వ్యక్తికి సేవింగ్స్ తప్పనిసరి. మన ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. దీనిని దాచి పెట్టడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. భూమి రూపంలో, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రూపంలో, మార్కెట్ రూపంలో లేదా మన వద్ద నగదును అట్టి పెట్టుకోవడం.. ఇలా వివిధ మార్గాల్లో దాచిపెట్టుకోవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత చాలామందిలో సేవింగ్ చేయాలనే ఆలోచన పెరిగింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మన సేవింగ్స్ ఎలా ఉపయోగపడతాయో అర్థమైంది. అందుకే చాలామంది సేవింగ్స్ కోసం కేటాయిస్తున్నారు.

ఇంకా సమయం ఉందనుకోవద్దు...

ఇంకా సమయం ఉందనుకోవద్దు...

సేవింగ్ చేయడం సరే.. కానీ మన సంపాదన ఇరవై నుండి 30 ఏళ్ల మధ్యనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వయస్సులో వచ్చే ఆదాయాన్ని కూడా సేవింగ్స్ వైపు మళ్లించడం నేర్చుకోవాలి. అంటే మనకు ఆదాయం వచ్చిన ప్రారంభంనుండే సేవింగ్స్ వైపు చూడాలి.

ఇప్పుడే ఉద్యోగంలో చేరాం.. అప్పుడే ఇన్వెస్ట్ చేయాలా.. మనకు ఇంకా చాలా సమయం ఉంది. అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే, అంత ఎక్కువ రిటర్న్స్ లేదా ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి ఆదాయం ప్రారంభమైనప్పటి నుండే సేవింగ్స్ చేయడం నేర్చుకోవాలి.

మొదట్లోనే ఆరంభిస్తే ఎక్కువ ప్రయోజనం

మొదట్లోనే ఆరంభిస్తే ఎక్కువ ప్రయోజనం

మీరు ఉద్యోగం పొందిన ప్రారంభం నుండే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, మీకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి మీ వద్ద కొంత డబ్బు ఉంటుంది. మీ పొదుపు అలవాటు మీ వయస్సు పెరిగే కొద్దీ మిమ్మల్ని మంచి స్థానంలో ఉండేలా చేస్తుంది. ఇరవై ఏళ్లలో మీరు మీ ఆదాయంలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసినా, అరవై ఏళ్లు వచ్చేసరికి లక్షలు మీ చేతికి వస్తాయి. ముప్పై ఏళ్లకు ప్రారంభిస్తే అప్పుడు తగ్గిపోతుంది. దాదాపు సగం కంటే తక్కువకు పడిపోతుంది. కాబట్టి ప్రారంభం నుండే పొదుపు అలవర్చుకోవాలి. ఉదాహరణకు 20 ఏళ్లలో మీరు రూ.1 లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, రిటైర్మెంట్ సమయానికి రూ.45 లక్షలు అవుతుంది. అదే 30 ఏళ్లకు ప్రారంభిస్తే అది రూ.17 లక్షలు మాత్రమే రిటర్న్స్ వస్తాయి.

మనీ సూత్రాలు

మనీ సూత్రాలు

ఆదాయ ప్రారంభం నుండే పొదుపుకు ఈ ఆరు సూత్రాలు కీలకం. మీ ఆదాయంలో లేదా మీ వేతనంలో 10 శాతం నుండి 20 శాతం పక్కన పెట్టాలి.

మీరు ఇన్వెస్ట్ చేయకుండా, ప్లాన్ లేకుండా ముందుకు సాగితే ద్రవ్యోల్భణం సమయంలో మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కువ డబ్బులు కోల్పోవాల్సి ఉంటుంది.

పొదుపు చేయడంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మధ్యకాలిక లక్ష్యాలు ఉండాలి.

పొదుపు గురించి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి.

మీ పెట్టుబడులను డైవర్సిఫై చేయాలి. బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిప్.. ఇలా వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి.

పొదుపుతో పాటు హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ ఉండటం అవసరం.

English summary

సేవింగ్స్ కోసం టైమ్ ఉందనుకోవద్దు: 20లో ఈ మనీ సూత్రాలు పాటించాలి | Money Saving Rules To Follow In Your Early 20s

Saving and investing when in your 20s may seem unreal. After all, there are many more years left to do all this. But an early start gives huge benefits.
Story first published: Friday, March 11, 2022, 13:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X