ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మన దేశంలో పెళ్ళిళ్ళకు ఒక సంప్రదాయం ఉంది అలాగే ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటారు. సాధారణంగా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది కాబట్టి ఖర్చులకు అస్సలు వెనకాడరు. మన దగ్గర కొన్ని రోజుల పాటు కూడా ఈ పెళ్ళి వేడుకలు నిర్వహిస్తారు. ఇతర దేశాల పెళ్లిళ్లతో పోలిస్తే భారతీయ వివాహాలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటాయి. ఇంకా పెద్ద ఈవెంట్‌లు, రోజుల తరబడి జరిగే ఆచారాలు, గ్రాండ్ వేదికలలో గొప్పగా ఈ పెళ్లి వేడుకలు జరుగుతాయి. కొందరు ప్రముఖులు పెళ్లిళ్లపై డబ్బును నీటిలా ఖర్చు చేయడానికి కారణం కూడా ఇదే.
అయితే కొన్ని సందర్భాలలో కొంతమందికి పెళ్లి ప్లాన్ చేసుకోవడానికి తగినంత డబ్బు లేకపోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితులలో బంధువులు లేదా ఫ్రెండ్స్ నుండి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తుంటుంది. కానీ మీరు పెళ్లి ఖర్చుల కోసం మ్యారేజ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బంధువులు లేదా స్నేహితుల నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఉపయోగకరం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ లేదా ప్రయివేట్ బ్యాంకులు మ్యారేజ్ లోన్లపై కొన్ని నిబంధల ప్రకారం డబ్బు ఇస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే లోన్ పై ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉంటుంది ఇంకా ప్రతినెలా ఈఎంఐ కూడా తక్కువ మొత్తంలో కాకట్టుకోవచ్చు. అలాగే చాల తక్కువ డాక్యూమెంటేషన్, పేపర్ వర్క్ ఉంటుంది.

అవసరాన్ని బట్టి సెలక్ట్ చేసుకోండి
చాలా బ్యాంకులు కస్టమర్లకు మ్యారేజ్ లోన్స్ అందజేస్తున్నాయి. మ్యారేజ్ లోన్ అనేది ఒక రకమైన పర్సనల్ లోన్, దీనిని పెళ్లి సంబంధిత ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా మీరు పెళ్లి ఖర్చుల కోసం కూడా మీ క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు లిమిట్లోపు మాత్రమే ఖర్చు చేయవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది సెలక్ట్ చేసుకోవాలి అనేది మీ పెళ్లికి అయ్యే ఖర్చులను బట్టి ఉంటుంది. మీకు ఎక్కువ డబ్బు అవసరమైతే మ్యారేజ్ లోన్ తీసుకోవడం మంచి అప్షన్, కొంచెం తక్కువ డబ్బు అవసరమైతే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
క్రెడిట్ కార్డ్‌లతో పోలిస్తే మ్యారేజ్ లోన్లకు తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. మ్యారేజ్ లోన్లో మీరు ప్రతినెలా ఫిక్స్డ్ అమౌంట్ EMI రూపంలో చెల్లించాలి. కానీ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా కొనడం ఈజీగా ఉండవచ్చు. దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. లోన్ తీసుకోవాలంటే మీకు కొన్ని డాక్యుమెంటేషన్ పేపర్స్ అవసరం. అంతే కాకుండా, మీరు మీ అవసరాన్ని బట్టి మ్యారేజ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ రెండింటినీ కూడా ఉపయోగించవచ్చు. అయితే మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును టైంకి చెల్లించకపోతే బ్యాంకు మీకు పెనాల్టీగా ఎక్కువ వడ్డీని ఛార్జ్ చేస్తుందని గుర్తుంచుకోండి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications