ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన కారణంగా అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నిన్నటి సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు పతనమైంది. ఓ సమయంలో 1800 పాయింట్ల వరకు దిగజారింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లో ముగిసింది. సోమవారం మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ నాలుగు నెలల కనిష్టం 55,822 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించడం, షేర్ల వ్యాల్యూ అధికంగా ఉండటంతో ప్రాఫిట్ బుకింగ్, చిన్న ఇన్వెస్టర్ల నుండి రాబడులు తగ్గడం, ద్రవ్యోల్భణం అధికస్థాయిల వద్ద కొనసాగడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై మరోసారి అనిశ్చితి నెలకొనడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.

రెండు రోజుల్లోనే..
వరుసగా రెండు రోజుల్లోనే మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గతవారం చివరి సెషన్‌లో, ఈ వారం ప్రారంభ సెషన్‌లో (సోమవారం).. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2.79 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోగా, ఇన్వెస్టర్ల సంపద రూ.11.45 లక్షల కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం 4.65 లక్షల కోట్ల సంపద, సోమవారం రూ.6.80 లక్షల కోట్ల సంపద క్షీణించింది. సెన్సెక్స్ 30 షేర్లలో హిందూస్తాన్ యూనీలీవర్, డాక్టర్ రెడ్డీస్ మినహా అన్ని షేర్లు నష్టపోయాయి.
ఈ నెల 13వ తేదీ నుండి సూచీలు వరుసగా పతనం అవుతున్నాయి. గత వారం సెన్సెక్స్ 1775 పాయింట్లు, నిఫ్టీ 526 పాయింట్లు, సోమవారం 1190 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు పడిపోయింది. మొత్తంగా ఈ ఆరు సెషన్‌లలో సెన్సెక్స్ 2965 పాయింట్లు, నిఫ్టీ 897 పాయింట్లు క్షీణించింది.లాక్ డౌన్ భయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గాయి. దీంతో డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 16 పైసల మేర బలపడి 75.90 వద్ద ముగిసింది.

ఈ నెల్లో సూచీలు మరింత పతనం?
ఈ ఏడాది అక్టోబర్ నెలలో నమోదు చేసుకున్న ఆల్ టైమ్ రికార్డు స్థాయిలతో సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే 10 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్లకు పైగా తగ్గింది. FPIల పెట్టుబడుల ఉపసంహరణ మరింత కాలం కొనసాగవచ్చునని, స్వల్పకాలంలో సూచీలు మరింత దిద్దుబాటుకు లోను కావొచ్చునని ఈక్విటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాంకేతికంగా కూడా మరింత దిద్దుబాటు కనిపిస్తోందని అంటున్నారు. ఒమిక్రాన్ ఆందోళన, ద్రవ్యోల్భణ భయాలు, క్రూడ్ ధరల క్షీణత వంటి వివిధ అంశాలు మరింత కాలం కొనసాగవచ్చునని, కాబట్టి ఈ డిసెంబర్ చివరి నాటికి సూచీలు మరింత పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి నిఫ్టీ 16,300 స్థాయికి చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లదీ అదే దారి
అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ, సింగపూర్ స్ట్రేయిట్ టైమ్స్, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ సహా వివిధ సూచీలు 2 శాతం వరకు నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. డౌజోన్స్ క్రితం సెషన్లో 433 పాయింట్లు, ఎస్ అండ్ పీ 52 పాయింట్లు కోల్పోయింది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications