Banking News: ముసలోళ్లనూ వదలని మోదీ సర్కార్..! SBI తాజా రిపోర్ట్ వివరాలివే..
Fixed Deposit: దేశంలో చాలా మంది ప్రజలు ప్రధానంగా వృద్ధులు తమ డబ్బును దాచుకోవటానికి ఎంచుకునే ఉత్తమమైన మార్గాల్లో ఒకటి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు. వీటిలో వడ్డీ ఆదాయం తక్కువగానే ఉన్నప్పటికీ రక్షణ, భద్రత ఎక్కువని ప్రజలు దీనిని ఎంచుకుంటుంటారు.
వివరాల్లోకి వెళితే.. గత ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఆర్జించిన వడ్డీపై మోదీ ప్రభుత్వం రూ.27,000 కోట్లకు పైగా పన్ను వసూలు చేసింది. ఈ వివరాలను దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.

SBI నివేదిక ప్రకారం.. గడచిన ఐదేళ్లలో డిపాజిట్లు మొత్తంగా 143 శాతం పెరిగి 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది 5 ఏళ్ల కిందట రూ.14 లక్షల కోట్లతో పోలిస్తే భారీ పెరుగుదలని చెప్పుకోవచ్చు. ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన రెపో రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లు తమ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డి పథకాల్లో పార్క్ చేశారు. దీంతో ఈ కాలంలో మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల సంఖ్య 81 శాతం పెరిగి 7.4 కోట్లకు చేరుకున్నాయి.
వీటిలో 7.3 కోట్ల ఖాతాల్లో రూ.15 లక్షలకు పైగా జమ అయినట్లు ఎస్‌బీఐ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అంచనాను దృష్టిలోకి తీసుకున్నట్లయితే.. సీనియర్ సిటిజన్లు గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూపంలోనే రూ.2.7 లక్షల కోట్లు ఆర్జించారు. ఇందులో బ్యాంకు డిపాజిట్ల నుంచి రూ.2.57 లక్షల కోట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ నుంచి మిగిలిన మొత్తం ఉన్నాయని నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications