Saving Scheme: మోదీ సర్కార్ సరికొత్త పథకం.. రేపటి నుంచే, ఎవరికి ప్రయోజనం అంటే..?
NPS Vatsalya Scheme: దేశంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లల కోసం అనేక సేవింగ్ స్కీమ్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇవి వారికి ఆర్థిక భరోసాను, సంరక్షణను అందించటంతో పాటు మంచి పొదుపు రాబడులను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ 3.0 దేశంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా, పొదుపును ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ గురించే. కేంద్ర వార్షిక బడ్జెట్ 2024-25లో ప్రకటించిన విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్‌పీఎస్ వాత్సల్య యోజనను సెప్టెంబర్ 18, 2024న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్కీమ్ సభ్యత్వం పొందాలనుకునే వారి కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించి పథకం బ్రోచర్‌ను ఆర్థిక మంత్రి విడుదల చేయనున్నారు. స్కీమ్ కింద కొత్త మైనర్ కస్టమర్లకు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(PRAN) కార్డులు పంపిణీ చేయబడతాయి.

దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రదేశాల్లో ఎన్‌పీఎస్ వాత్సల్య కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించబడతాయి. పిల్లల ఆర్థిక భవిష్యత్తును కాపాడే క్రమంలో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ పెన్షన్ పథకానికి తల్లిదండ్రులు, సంరక్షకులు సహకరిస్తారని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్కీమ్ కింద నమోదు చేసుకున్న పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాత సదరు ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.1,000 పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.
చిన్న వయస్సులో పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని పిల్లలకు దీర్ఘకాలంలో తల్లిదండ్రులు పిల్లలకు బహుమతిగా అందించడానికి దోహదపడుతుంది. చిన్న వయస్సులేనే ఆర్థికంగా వారి భవిష్యత్తుకు బాటలు వేయటం ద్వారా వారు పదవీ విరమణ సమయానికి పెద్ద కార్పస్ పొందుతారు. పిల్లలకి 18 ఏళ్లు వచ్చినప్పుడు, ఖాతాను సులభంగా సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు. పైగా వారికి జీవితంలో చిన్న వయస్సు నుంచే పొదుపుపై మంచి అవగాహన కలుగుతుంది. పదవీ విరమణ తర్వాత కార్పస్‌లో కొంత భాగాన్ని పన్ను రహితంగా ఉపసంహరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications