నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆర్థిక కార్యకలాపాలు చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. మనం బతికేతి డబ్బు కోసం అన్నట్లుగా జీవితాలు తయ్యారయ్యాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇల్లు కొనొచ్చు, ఫ్రిజ్ తీసుకోవచ్చు, టూర్ కి వెళ్లొచ్చు. డబ్బులు అందుబాటులో లేకపోయినా సరే లోన్లు తీసుకుని వాటిని EMIలుగా సులభమైన వాయిదాల్లో చెల్లించొచ్చు. అయితే మధ్యతరగతి EMI ఉచ్చు కబళిస్తున్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు. మన ఆదాయాన్ని ఇది నిశ్శబ్దంగా తినేస్తూ పోతోంది. మధ్యతరగతి జీవితాల్లో ముప్పుగా మారుతున్నాయి ఈ లోన్లకు కట్టే ఈఎంఐలు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా EMI భారం ఎక్కువగా ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నది. రుణాల ఉచ్చు నిశ్శబ్దంగా ప్రజలకు వచ్చే ఆదాయాన్ని తినేస్తోంది. వారి పొదుపు అవకాశాలను కొల్లగొడుతోంది. ఆర్థిక నిపుణుడు తపస్ చక్రవర్తి తెలిపిన ప్రకారం.. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఒక చేత్తో సంపాదించి, మరొక చేత్తో అప్పులు తీర్చే పరిస్థితిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజలు వస్తువులపై పెంచుకున్న మోజు అని చెబుతున్నారు.

ఇప్పుడు ఫోన్ నుంచి బైక్ దాకా.. ఏది కావాలన్నా EMI పై తీసుకోవచ్చు. దీంతో పాటుగా క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి అనే జీవనశైలి మధ్యతరగతి జీవులకు అలవాటుగా మారిపోయింది. దీనివల్ల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మనం ఓ సారి గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి 5 మందిలో 3 మందికి కనీసం మూడు రకాల అప్పులున్నాయి. ఈ చిన్న చిన్న వాయిదాలు కలిసిపోయి నెలకు రూ. 25,000 వరకు చేరుతున్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే.. ఫోన్ EMI రూ. 2,400, ల్యాప్‌టాప్ రూ. 3,000, బైక్ రూ. 4,000, క్రెడిట్ కార్డ్ బిల్లు రూ. 6,500. ఇలా చూసుకుంటే నెలవారీ ఆదాయంలో పెద్ద భాగం వాయిదాలకే వెళ్ళిపోతుంది.
ఈఎంఐల భారం Middle Class కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అప్పులతో పొదుపు చేయలేక భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టడం అనేది అసాధ్యం అవుతోంది. దేశ ఆర్థికాభివృద్ధికీ ఇది దుష్ప్రభావాన్ని చూపించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ మొత్తం EMIలు ఆదాయంలో 40% మించకూడదని తపస్ చక్రవర్తి చెబుతున్నారు. అలాగే, నెలకు రూ. 500 చొప్పున భద్రతా నిధిని ప్రారంభించాలి. SIP వంటి పథకాలలో పెట్టుబడి పెడితే, భవిష్యత్తు కొద్దిగా సురక్షితంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
అంతిమంగా ధనవంతులా కనిపించడానికి అప్పు చేయవద్దని ఆయన సూచిస్తున్నారు. ఒత్తిడితో నిండిన జీవితం విజయాన్ని ఇవ్వదు. నిజమైన స్వేచ్ఛ ఎక్కువ సంపాదించడం ద్వారా కాకుండా, తక్కువ అప్పులతో సాధించవచ్చు. మధ్యతరగతి కల EMI ఉచ్చు కింద మరణించకూడదని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications