For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Invest in Stocks: సెన్సెక్స్ కంటే ఇవి ఎక్కువ లాభాలను ఇచ్చాయి

|

ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో లేదా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మున్ముందు కూడా ఆశాజనకంగానే కనిపిస్తున్నాయని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ఫిబ్రవరి 20వ తేదీ నుండి బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 14 శాతం, 17 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 8.2 శాతం లాభపడింది. ఇక ఈ ఏడాదిలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాపూ సూచీలు 1.7 శాతం మేర లాభపడగా, బెంచ్ మార్క్ సూచీ 1.3 శాతం లాభపడింది.

మంచి ఆప్షన్ కానీ

మంచి ఆప్షన్ కానీ

అక్టోబర్ 2021 తర్వాత ఇటీవలి మార్కెట్ కరెక్షన్.. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టుబడికి మంచి ఆప్షన్‌గా పేర్కొంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ద్రవ్యోల్భణ ఆందోళనలు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం, భవిష్యత్తు ఆదాయాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలని అంటున్నారు. 2020 కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి ఇది అత్యంత అస్థిరమైన సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. విదేశీ పెట్టుబడిదారుల నుండి అస్థిరమైన అమ్మకాలు, ఉక్రెయిన్ పైన రష్యా దాడి, అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ప్రభావం చూపాయి.

లార్జ్ క్యాప్ ఎఫెక్ట్

లార్జ్ క్యాప్ ఎఫెక్ట్

ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దిశగా ఇన్వెస్టర్లు ఎక్కువగా చూస్తున్నారని, ఇందుకు ఆటో, ఎఫ్ఎంసీజడీ వంటి లార్జ్ క్యాప్ విభాగాలు అధిక కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ఒత్తిడిలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఈ రంగాలు సానుకూలం

ఈ రంగాలు సానుకూలం

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నిర్మల్ బ్యాంగ్ ఏప్రిల్ 7వ తేదీన మిడ్ క్యాప్ సెక్టార్ పైన ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం కవరేజీని మూడు సెక్షన్లుగా స్పెషాలిటీ కెమికల్స్, స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. స్పెషాలిటీ కెమికల్స్‌తో పాటు ఎంపిక చేసిన స్పెషాలిటీ ఇంగ్రీడియంట్ కంపెనీల్లో బలమైన వృద్ధి పథకం కనిపిస్తోందని బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది. మిడ్, స్మాల్ క్యాప్‌కు చెందిన ఈ రంగాలు పుంజుకోవచ్చునని అంటున్నారు.

English summary

Invest in Stocks: సెన్సెక్స్ కంటే ఇవి ఎక్కువ లాభాలను ఇచ్చాయి | Mid cap, small cap indices outsmart Sensex with 1.7 percent gains in a year

Mid-cap and small-cap stocks began outshining the bigger benchmark gauge since the time Russia declared a war on Ukraine and, this trend is likely to continue for the rest of the year, according to experts.
Story first published: Tuesday, April 12, 2022, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X