ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్ తాజాగా తన నెట్ వర్క్‌లో కొన్ని క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్‌ను అనుమతిస్తోంది. ఈ మేరకు తమ కార్డుహోల్డర్లకు ఈ వెసులుబాటును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో క్రిప్టో చెల్లింపుల కోసం సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించింది. డాలర్ వంటి ఫియట్ కరెన్సీలతో అనుసంధానించబడిన స్థిర కరెన్సీ లేదా క్రిప్టోకరెన్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ నెట్ వర్క్‌కు దీనిని జోడిస్తున్నామని బుధవారం ఓ బ్లాక్‌పోస్ట్‌లో మాస్టర్ కార్డ్ తెలిపింది.

క్రిప్టోకరెన్సీలతో భాగస్వామ్యం
ఈ ఏడాది తమ నెట్‌వర్క్‌లో నేరుగా ఎంచుకున్న క్రిప్టోకరెన్సీలకు మాస్టర్ కార్డ్ అనుమతించడం ప్రారంభిస్తుందని తెలిపింది. కొత్త డిజిటల్ కరెన్సీలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులతో చురుగ్గా పని చేస్తోంది. కంపెనీ తన సొంత ప్రణాళికలలో కస్టమర్ల రక్షణ, సమ్మతికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. మాస్టర్ కార్డ్ ఇప్పటికే వైరెక్స్, బిట్‌పేతో సహా కొన్ని పెద్ద క్రిప్టోకరెన్సీ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఎలాంటి సంకోచం లేకుండా
క్రిప్టో కరెన్సీ పైన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రపంచం డిజిటలైజ్ అవుతోందని, అందుకే డిజిటల్ ఆస్తులకు నేరుగా మద్దతిచ్చేందుకు ఈ నిర్ణయం క్రిప్టోకరెన్సీని అంగీకరించేందుకు అనుమతిస్తుందని మాస్టర్ కార్డ్ తెలిపింది. ఈ నిర్ణయం కస్టమర్లు, వ్యాపారులు క్రిప్టో, సాంప్రదాయాల మధ్య కొనుగోళ్లు చేయడానికి సంకోచించకుండా ఉండటానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ ప్రకారం స్టేబుల్ కాయిన్స్‌ను అంగీకరించేందుకు నాలుగు షరతులు ఉన్నాయి.

ఈ నాలుగు షరతులు
ఇవి మొదట వినియోగదారుల రక్షణ, ఇందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, రెండు అక్రమ కార్యకలాపాలు, మోసాలు తొలగించే ఉద్దేశ్యం, మూడు డిజిటల్ అసెట్స్ ఉపయోగించేవారు స్థానిక ప్రాంతాల చట్టాలు, నిబంధనలు పాటించడం, నాలుగవది క్రిప్టో ఆస్తులు పెట్టుబడి కోసం కాకుండా ప్రజలకు స్థిర స్పెండింగ్స్ అందించడం. ఇదిలా ఉండగా, క్రిప్టోకరెన్సీని ఉపయోగించడం ప్రారంభించాలని తాము సిఫార్స్ చేయడంలేదని, అయితే కస్టమర్లు, వ్యాపారులు, డిజిటల్ వ్యాల్యూను అందించేందుకు కృషి చేస్తామని మాస్టర్ కార్డ్ తెలిపింది.


Click it and Unblock the Notifications