మాస్టర్‌కార్డ్‌పై ఆర్బీఐ నిర్ణయం ఈ బ్యాంకులపై ప్రభావం: మీ కార్డు బ్లాక్ అవుతుందా?
మాస్టర్ కార్డ్ పైన కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ ప్రభావం ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), మరో 5 ప్రయివేటు రంగ బ్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది. స్థానికంగా డేటా నిల్వ చేయాలనే నిబంధనలను పాటించలేదనే కారణంతో ఈ నెల 22వ తేదీ నుండి కొత్తగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీ చేయరాదని ఆర్బీఐ నిషేధ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు ప్రధానంగా యస్ బ్యాంకు, ఆర్బీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్‌పై పడనుందని రీసెర్చ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ బ్యాంకులపై ప్రభావం
ప్రధానంగా ఐదు ప్రయివేటు బ్యాంకులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకులపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత HDFC బ్యాంకు పైన కూడా ప్రభావం పడే అవకాశముంది. అయితే ఇప్పటికే HDFC బ్యాంకు పైన కొత్త క్రెడిట్ కార్డ్స్ జారీకి సంబంధించి ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ కార్డ్స్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

మరో రెండు మూడు నెలలు
మరొక పేమెంట్ గేట్‌వే ద్వారా కార్డ్స్ జారీ కోసం మరో రెండు నుండి మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఎందుకంటే ఇందులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇతర పద్ధతులు ఉంటాయి. మాస్టర్ కార్డ్‌తో జత కలిసి కార్డ్స్ జారీ చేసే భాగస్వాముల్లో యస్ బ్యాంకు, ఆర్బీఐల్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయని, వీటిపై ఎక్కువ ప్రభావం పడే ్వకాశముందని నోమురా నివేదిక తెలిపింది.

40 శాతం వరకు ప్రభావం
ఇవి జారీ చేసే అన్ని క్రెడిట్ కార్డ్స్ స్కీంలు మాస్టర్ కార్డ్ కింద ఆఫర్ చేస్తున్నాయని, అందుకే పై బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలపై ఆర్బీఐ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిషేధిత మాస్టర్ కార్డుతో భాగస్వామ్యంతో 35 శాతం నుండి 40 శాతం క్రెడిట్ కార్డు స్కీంలు నిర్వహిస్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు అధికంగా ప్రభావితం కానున్నాయి. ప్రస్తుత పరిణామాలతో ఈ బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. ఎస్బీఐ మాస్టర్‌కార్డ్ కింద 10 శాతం స్కీంలనే ఆఫర్ చేస్తుండటంతో ప్రభావం తక్కువే. ఆర్బీఐ గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ , డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లపై కూడా ఆర్బీఐ ఈ తరహా నిషేధం విధించింది.

ఆందోళన అవసరం లేదు
మాస్టర్ కార్డుపై ఆర్బీఐ నిర్ణయం ఇప్పటికే ఉపయోగించే కార్డుదారులపై ప్రభావం చూపదు. మాస్టర్ కార్డు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే పొందుతున్న అన్ని సేవలు పొందగలుగుతారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ సిస్టం యాక్ట్ 2019 ప్రకారం దేశంలో వర్క్ చేస్తుంది.


Click it and Unblock the Notifications