For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్‌కు ఎఫ్‌పీఐ అమ్మకాల దెబ్బ.. కాస్త ఊరట, నష్టాల్లో ఈ స్టాక్స్ అదుర్స్

|

స్టాక్ మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిసిన అనంతరం, నేడు (సోమవారం, మ 9) భారీ నష్టాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం గం.1 సమయానికి 175 పాయింట్ల నష్టానికి తగ్గింది. సెన్సెక్స్ ఓ సమయంలో 900 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత మాత్రం కోలుకుంది. ఈ రోజు ప్రారంభ మార్కెట్ సందర్భంగా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. సెన్సెక్స్ దారుణంగా పతనమైన సమయంలో ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్లు నష్టపోయారు. అయితే ఆ తర్వాత కోలుకోవడం గమనార్హం. సెన్సెక్స్, నిఫ్టీలు ఉదయం 1.5 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్ల దిగువకు కూడా వెళ్లింది. దీంతో నష్టం భారీగా తగ్గింది.

ఈ స్టాక్స్ అదుర్స్

ఈ స్టాక్స్ అదుర్స్

ఉదయం భారీగా నష్టపోయిన సమయంలోను పలు స్టాక్స్ ఎగిసి పడ్డాయి. PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అహ్లువాలియా కాంట్రాక్ట్స్ ఇండియా లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్ లాభపడ్డాయి. బీఎస్ఈ గ్రూప్ ఏ గెయినర్స్ జాబితాలో ఇవి నిలిచాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి PNB హౌసింగ్ ఫైనాన్స్ 1.58 శాతానికి పైగా, అహ్లువాలీయా కాంట్రాక్ట్ షేర్లు 3.50 శాతానికి పైగా ఎగిసిపడ్డాయి. బోరోసిల్ లిమిటెడ్ 5 శాతానిగి పైగా లాభపడ్డాయి.

ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు

ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు

ఇండియన్ మార్కెట్లో ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. మే 2022 మొదటి వారంలో ఫారెన్ ఇన్వెస్టర్లు రూ.6471 కోట్ల అమ్మకాలు చేపట్టారు. అదే సమయంలో 2022 మొత్తంలో ఫారెన్ ఇన్వెస్టర్లు రూ.1.33,500 కోట్ల అమ్మకాలు చేపట్టారు. ఈ ప్రభావం సూచీలపై పడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ అననుకూలతలు దెబ్బతీశాయి.

ఐటీ స్టాక్స్ అదుర్స్

ఐటీ స్టాక్స్ అదుర్స్

హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 3 శాతం క్షీణించింది. రంగాల వారీగా చూస్తే ఐటీ స్టాక్స్, లాభపడ్డాయి. మెటల్, పవర్ మాత్రం ఒత్తిడిలో ఉన్నాయి. పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్‌లు 1 శాతం నుండి 3 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే విప్రో 0.29 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ 2 శాతం, ఇన్ఫోసిస్ 2.11 శాతం లాభపడ్డాయి. టాప్ 5లో టీసీఎస్ అతి స్వల్పంగా 0.057 శాతం, టెక్ మహీంద్రా 1.58 శాతం నష్టపోయాయి.

English summary

మార్కెట్‌కు ఎఫ్‌పీఐ అమ్మకాల దెబ్బ.. కాస్త ఊరట, నష్టాల్లో ఈ స్టాక్స్ అదుర్స్ | Market was missing due to the sale of FPI, stocks emerged as gainers

PNB Housing Finance Ltd, Ahluwalia Contracts (India) Ltd, and Borosil Ltd gained the most and topped BSE’s Group A gainers’ list.
Story first published: Monday, May 9, 2022, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X