స్టాక్ మార్కెట్ పైన గత మూడు నాలుగు నెలలుగా బేర్ మార్కెట్ పట్టు కొనసాగుతోంది. అక్టోబర్ 2021లో సెన్సెక్స్ ఆల్‌టైం గరిష్టం 62,245 పాయింట్లతో 0 శాతానికి పైగా తక్కువగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సెన్సెక్స్ నిన్న 54,600 దిగువకు పడిపోయింది. నేడు కోలుకొని, 55,800 స్థాయిలో ఉంది. ఇప్పటికీ 56,000 పాయింట్లకు దిగువనే ఉంది.
అయితే స్టాక్ మార్కెట్‌లో గత మూడు నాలుగు నెలలుగా స్మాల్, మిడ్ క్యాప్ స్పేస్ బేర్ గ్రిప్‌లో ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బీఎస్ఈ 500 షేర్లలో సగం వరకు క్షీణించాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ మరింత కాలం తీవ్ర ఊగిసలాటలో కొనసాగవచ్చునని చెబుతున్నారు.

ఊగిసలాటలోనే..
నిఫ్టీ కొద్ది నెలలుగా భారీ ఊగిసలాటలో కనిపిస్తోంది. ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ సిరీస్ పది నెలల గరిష్టం 1.45 శాతం మేర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2021 ఏప్రిల్ సిరీస్‌లో సగటున 1.55 శాతం, అంతకుముందు మార్చి సిరీస్‌లో 1.77 శాతం మేర ఈ సూచీ ఊగిసలాడింది.
గత పన్నెండు నెలల సగటు తీసుకుంటే 1.19 శాతంగా ఉంది. 2021 జూలైలో మాత్రమే అతి తక్కువ 0.77 శాతం ఊగిసలాట కనిపించింది. ఫిబ్రవరి సిరీస్ నిఫ్టీ 3.5 శాతం మేర నష్టపోయింది. 2022 మార్చి సిరీస్‌లోను భారీ ఊగిసలాటలు తప్పకపోవచ్చు.

అప్పటి వరకు అప్రమత్తం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల వల్ల మనపై వాణిజ్య ప్రభావం, అలాగే, ఐరోపా దేశాలపై ఈ సంక్షోభ ప్రభావాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తారు. రష్యా కాస్త శాంతిస్తే మార్కెట్ పరుగుకు దోహదపడుతుంది. దీనికి తోడు మిడ్ మార్చిలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం మార్కెట్ పైన ఉండవచ్చు. రేటు పెంపు ఉంటే మార్కెట్లు నష్టపోవచ్చు. అదే సమయంలో అప్పటి వరకు అప్రమత్తంగా కదలాడే అవకాశముంది.

ఎన్నికల ఫలితాల ప్రభావం
మన దేశ పరిణామాల విషయానికి వస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే మార్కెట్ సెంటిమెంట్ బలపడుతుంది. వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశముంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications