మార్కెట్‌కు లీడర్ అంటూ ఎవరూ ఉండరని, మార్కెట్ మాత్రమే రారాజు అని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురువారం అన్నారు. మార్కెట్‌కు తామే రాజుము అనుకున్న వాళ్లు ఇప్పుడు ఆర్థర్ జైలులో ఉన్నారన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. వాతావరణం, మరణం, మహిళ, మార్కెట్‌ను కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరన్నారు. ఇవి అంచనాలకు అందనివి అన్నారు. మార్కెట్‌దే ఎప్పుడు పై చేయి అని వ్యాఖ్యానించారు.

రాజు ఎప్పుడూ ఒక్కడేనని
రాజు ఎప్పుడూ ఒక్కడేనని, అది మార్కెట్ అన్నారు రాకేష్. భారత్‌కు సమయం రాబోవడం లేదని, ఇప్పటికే వచ్చేసిందన్నారు. 2025-26 నాటికి భారత జీడీపీ పది శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనాలు ఉన్నాయని, మార్కెట్ కూడా మహిళ వంటిదేనని, మనలను నిర్దేశిస్తుందని, అనిశ్చితి, ఊగిసలాటలకు గురి అవుతుందన్నారు. మహిళ పైన, మార్కెట్ పైన అజమాయిషీ చేయలేమన్నారు.

అందుకే లిస్టింగ్ వద్దు
బ్లూచిప్ కంపెనీలతో పోలిస్తే రియాల్టీ అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రాకేష్. అందుకే ఆయా కంపెనీలని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయవద్దన్నారు. అఫోర్డబుల్ ఇళ్ల అభివృద్ధిదారులు మాత్రమే తాము విక్రయించే పరిమాణం ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ ప్రయత్నించవచ్చునని తెలిపారు. కొన్ని సంస్థలు మాత్రమే ఎక్స్చ్ంజీల్లో నమోదు కావడం గమనించవచ్చునని తెలిపారు. డీఎల్ఎఫ్ వంటి షేర్ రూ.1300 నుండి రూ.80కి పడిపోయిందని, ఈ రంగంలో నష్టభయం ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. నేను కనుక డెవలపర్‌ను అయితే స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయనని చెప్పారు.

ఇప్పుడు ఉంటే రూ.1000 కోట్లు
బ్లూచిప్ స్టాక్స్ పెట్టుబడిపై 18 శాతం నుండి 25 శాతం ప్రతిఫలం అందిస్తుండగా రియాల్టీ రంగంలో 6 శాతం నుండి 7 శాతం మాత్రమే వస్తుందన్నారు. రియాల్టీ రియాల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అసెట్ క్లాస్ పైన ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా ఉన్నారని, ఐటీ, ఫార్మా రంగాల మాదిరి ఈ విభాగం కూడా రాణించవచ్చునని చెప్పారు. 2006లో ఇంటి కొనుగోలు కోసం రాకేష్ తన పోర్ట్‌పోలియోలో క్రిసిల్ షేర్లను రూ.20 కోట్లకు విక్రయించారు. అప్పుడు వాటిని విక్రయించకుండా ఉంటే కనుక రూ.1000 కోట్లు ఉండేదని చెబుతున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications