స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు నష్టపోయాయి. గతవారం సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల మేర పడిపోయింది. మరోవైపు, బంగారం ధరలు రూ.48,000కు దిగువనే ముగిశాయి. అయితే మార్కెట్లో ఈ వారం లాభాల స్వీకరణ కొనసాగవచ్చునని, దీంతో మార్కెట్లు నష్టాల్లోనే ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ వారం మార్కెట్ మూడు రోజులు మాత్రమే ఉండనుంది. దీపావళి పర్వదినం రోజున అంటే నాలుగో తారీఖున మూరత్ ట్రేడింగ్ ఉంటుంది. ఇది గంట పాటు ఉంటుంది. ఈ వారం మార్కెట్ పైన పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. ఇందులో ఫెడ్ సమావేశం, కార్పోరేట్ ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు తదితరాలు ఉన్నాయి.

మార్కెట్ పైన ఈ ప్రభావం
ఈ వారం మార్కెట్ల గమనాన్ని వడ్డీరేట్లపై అమెరిక్ ఫెడ్ నిర్ణయంతో పాటు కార్పోరేట్ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఆటోమొబైల్ విక్రయ గణాంకాలు నిర్ధేశించే అవకాశముంది. ఈ వారం మార్కెట్లు మూడు రోజులు పని చేస్తాయి. దీపావళి పర్వదినం రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. బలిప్రతిపాద సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు రోజు. మార్కెట్ ఈవారమూ బేర్‌గానే ఉండవచ్చునని అంటున్నారు. నిఫ్టీ 18 వేల మార్కును అధిగమించిన అనంతరం డైలీ చార్టులపై లోయర్ టాప్, లోయర్ బాటంను సూచిస్తున్నాయి. మార్కెట్లు ఒకవేళ ముందుకు వెళ్తే 18000 నుండి 18100 వద్ద నిరోధం ఉండవచ్చు. డౌన్ ట్రెండ్‌లో 17400 స్థాయికు పడిపోయే అవకాశముంది. ఆ స్థాయి కంటే కిందకు పడిపోతే 17000 స్థాయిని తాకే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.

అక్టోబర్ నెలలో..
అక్టోబర్ నెల చార్ట్‌లో షూటింగ్ స్టార్ బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. దీంతో 20 రోజుల చలన సగటు దిగువకు పడిపోయింది మార్కెట్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వారాంతపు, నెలసరి ఛార్జీలలో స్పష్టమైన బేరిష్ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేశాయి. 95 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన నిఫ్టీ 500 ఇండెక్స్ కూడా బేరిష్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అక్టోబర్‌లో 18,604 తాకిన నిఫ్టీ మళ్లీ ఆ స్థాయిని ఇప్పుడు అధిగమించకపోవచ్చునని అంటున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో రూ.25,572 కోట్ల భారీ అమ్మకాలను జరిపారు. ఈ ఏడాది జూలై నెలలో విక్రయించిన రూ.23,193.39 కోట్ల కన్నా అధికం.

బంగారం, వెండి ధర
గోల్డ్ ఫ్యూచర్ అక్టోబర్ ఈ వారం రూ.48,400 ఎగువన నిలదొక్కుకోకుంటే కాస్త దిద్దుబాటు ఉండవచ్చు. టెక్నికల్‌గా కాంట్రాక్ట్‌కు రూ.47,230 వద్ద మద్దతు కన్పిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.46,850 వరకు కాంట్రాక్ట్ పడిపోయే అవకాశముంటుంది. ఒకవేళ కాంట్రాక్ట్ రూ.48,150 స్థాయిని అధిగమిస్తే రూ.48,700 వరకు రాణిస్తుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో రూ.47,400 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని రూ.47,800 వద్ద కొనుగోలు చేయవచ్చు. టెక్నికల్ అంశాలతో పాటు అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, డాలర్ కదలికలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతాయి. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ రూ.65,950 కంటే పైన కదలాడితే, రూ.66,700కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications